పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి రాజీనామాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అంగీకరించారు. ఆయనతో పాటు మంత్రి మండలి సభ్యుల రాజీనామాలను స్వీకరించారు. ఈ మేరకు రాజ్ భవన్ నోటిఫికేషన్ కాపీని మీడియాకు విడుదల చేసింది. ప్రభుత్వ గెజిట్లో ఈ నోటిఫికేషన్ ను ఉంచుతామని రాష్ట్ర కార్యదర్శి అశ్వనీ కుమార్ తెలిపారు.
నారాయణస్వామి రాజీనామాను స్వీకరించిన రాష్ట్రపతి - పుదుచ్చేరి సర్కార్
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజీనామాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అంగీకరించారు. ఆయనతో పాటు మంత్రి మండలి సభ్యుల రాజీనామా పత్రాలను సైతం స్వీకరించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది రాజ్ భవన్.
నారాయణ సామి రాజీనామాను స్వీకరించిన రాష్ట్రపతి
ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో.. ప్రభుత్వం బలం పడిపోయింది. ఈ నేపథ్యంలోనే.. బలపరీక్షకు ముందు నారాయణస్వామి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకు అందించారు.
ఇదీ చదవండి :పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ సర్కార్