తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిమాలయాల్లో అరుదైన 'బ్లూ షీప్​' ఆనవాళ్లు - forest department

అత్యంత అరుదైన నీలి గొర్రెల ఆనవాళ్లను హిమాలయాల్లో గుర్తించారు. హిమాచల్​ ప్రదేశ్​ కుల్లూలో 5000 అడుగుల ఎత్తులో పాదముద్రలను కనిపెట్టిన అటవీ అధికారులు వాటి జాడపై అధ్యయనం చేస్తున్నారు.

Evidence found of blue sheep presence in Great Himalayan National Park
హిమాలయ ఎగువ భాగాల్లో 'బ్లూ షీప్​' ఆనవాళ్లు

By

Published : Dec 6, 2020, 3:51 PM IST

హిమాచల్​ ప్రదేశ్​లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో.. అత్యంత అరుదుగా కనిపించే బ్లూ షీప్(నీలి గొర్రెలు)​ సంచరిస్తున్నట్లు గుర్తించారు అటవీ అధికారులు. భడల్​ అని కూడా పిలిచే వీటి పాదముద్రలను.. కుల్లూలోని గ్రేట్​ హిమాలయన్​ నేషనల్​ పార్కు అధికారులు 5 వేల అడుగుల ఎత్తులో కనిపెట్టారు. ఈ గుర్తుల ఆధారంగా బ్లూ షీప్​ ఉనికిపై అధ్యయనం చేస్తున్నారు.

హిమాలయాల్లోని అత్యంత ఎగువ ప్రాంతాలకు వెళ్లిన 10 మంది సభ్యుల అటవీ బృందానికి.. బ్లూ షీప్​ పాదముద్రలు, పేడ కనిపించాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాటిపై పరిశోధనలు జరిపారు. ఇప్పుడు వాటి జాడను కనిపెట్టే పనిలో పడ్డారు. ప్రస్తుతం అక్కడ భారీగా మంచు పేరుకుపోయిందని, హిమం తొలగించిన వెంటనే వీటి ఆధారాలను కనిపెడతామని అంటున్నారు అటవీ అధికారి సుమిత్​ భరద్వాజ్​. గతంలో ఇక్కడి జాతీయ పార్కులోనూ అడపాదడపా నీలి గొర్రెలు​ కనిపించేవని ఆయన చెబుతున్నారు.

అంతరించే దశలో..

బ్లూ షీప్​ ఎక్కువగా వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని ప్రస్తుతం కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాయి.

ఇవి ఎక్కువగా మంగోలియా నుంచి చైనా వరకు హిమాలయాల్లోనే తిరుగుతుంటాయి. అయితే వీటిని బ్లూ షీప్​ అని పిలిచినా.. రంగు మాత్రం నీలం లేదా గొర్రెల వర్ణాన్ని పోలి ఉండవు. లేత గోధుమ రంగులో మేకలను తలపించే ఈ జంతువులు.. గడ్డి, ఆకులు తింటూ జీవిస్తాయి. సుమారుగా 60-70 కేజీల బరువుంటాయి.

ఇదీ చూడండి:'గడ్డం' ఛాంపియన్​కు అవార్డులు దాసోహం

ABOUT THE AUTHOR

...view details