గర్భిణీపై పాల వ్యాపారి విచక్షణారహితంగా దాడి చేశాడు. సరైన సమయానికి పాల డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహంతో దారుణానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ మహిళ ఆస్పత్రిలో చేరింది. అయితే, ఆమెను పరీక్షించిన వైద్యులు.. మహిళకు గర్భస్రావం అయినట్లు గుర్తించారు. ఈ అమానవీయ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై యాక్షన్ తీసుకున్నారు.
పాల డబ్బులు ఇవ్వలేదని దారుణం.. మహిళపై దాడి.. గర్భస్థ శిశువు మృతి - పాల డబ్బులు ఇవ్వలేదని దారుణం
డబ్బులు ఇవ్వలేదని ఓ పాల వ్యాపారి దారుణానికి పాల్పడ్డాడు. సొమ్మును వసూలు చేసుకునేందుకు తన కొడుకులను వెంటబెట్టుకెళ్లిన వ్యాపారి.. కస్టమర్ కుటుంబ సభ్యులపై తీవ్ర దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డ మహిళకు గర్భస్రావం అయింది.
నిందితుడిని సుర్‌గుజాల సీతాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్బహ్లా గ్రామానికి చెందిన నారాయణ యాదవ్‌గా గుర్తించారు. వ్యాపారికి బాధిత మహిళ రూ.2,100 పాల బిల్లు బాకీ ఉంది. డబ్బు ఇవ్వలేదన్న కోపంతో ఊగిపోయిన ఓ పాల వ్యాపారి.. వాటిని వసూలు చేసేందుకు విజయ్ సోనీ అనే కస్టమర్ ఇంటికి తన కొడుకులను తీసుకెళ్లాడు. డబ్బులు ఇవ్వమని వారిని డిమాండ్ చేశాడు. మరుసటి రోజు వచ్చి డబ్బులు తీసుకెళ్లమని విజయ్ సోని తల్లి వ్యాపారికి సూచించింది. అయితే ఆమె మాటలను లెక్క చేయని పాల వ్యాపారి కొడుకులు వారిపై దాడికి దిగారు.
ఇంట్లో ఉన్న అందరిపై దాడి చేశారు. గర్భవతిగా ఉన్న విజయ్ మరదలిపైనా చేయి చేసుకున్నారు. దీంతో తీవ్ర గాయాలపాలైన మహిళకు గర్భస్రావం జరిగింది. అయితే డిసెంబర్ 29న ఈ ఘటన జరగగా.. బాధితులు డిసెంబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిసెంబర్ 31న ఆ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.