ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్ జిల్లాలో భాజపా, కాంగ్రెస్ శ్రేణుల (BJP Congress News) మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రమోద్ తివారీ (Pramod Tiwari news) వర్గీయులు తనతో పాటు తన అనుచరులపై దాడి చేశారని భాజపా ప్రతాప్‌గఢ్ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా (Sangam Lal Gupta news) ఆరోపించారు. సంగిపుర్ తాలుకాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. తన చొక్కా సైతం చించేశారని గుప్తా ఆరోపించారు.
"నేను నా కార్యకర్తలు సంగీపుర్లోని మేళాకు వెళ్లాం. అక్కడ కాంగ్రెస్ మాజీ ఎంపీ తివారీ డయాస్‌పై కూర్చున్నారు. నన్ను చూసి తివారీ, అతని అనుచరులు అరవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత హింసాత్మక దాడికి పాల్పడ్డారు. నన్ను కూడా కొట్టారు. నా కుర్తా చించేశారు."