డిసెంబర్ నెల మొదటి 15 రోజుల్లో దేశంలో విద్యుత్తు వాడకం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఈ 15 రోజుల్లో విద్యుత్తు వాడకం గతేడాదితో పోలిస్తే 4.8 శాతం మేర పెరిగినట్లు తెలిపాయి. గతేడాది ఇదే వ్యవధిలో 48.04 బిలియన్ యూనిట్ల విద్యుత్తు వాడినట్లు నమోదు కాగా ఈ ఏడాది 50.36 బిలియన్ యూనిట్లకు పెరిగినట్లు పేర్కొన్నాయి.
డిసెంబర్ ప్రథమార్థంలో పెరిగిన విద్యుత్తు వాడకం
డిసెంబర్ నెల ప్రథమార్థంలో దేశంలో విద్యుత్తు వాడకం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. విద్యుత్తు వాడకం గతేడాదితో పోలిస్తే 4.8 శాతం పెరిగిందని తెలిపాయి. లాక్డౌన్ తర్వాత వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకున్నందున విద్యుత్తు వినియోగం పెరిగిందని నిర్ధరించాయి.
'డిసెంబర్లో దేశంలో పెరిగిన విద్యుత్తు వినియోగం'
సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు గడిచిన ఏడాదితో పోలిస్తే మరుసటి ఏడాదిలో వృద్ధి నమోదవుతున్నట్లు తెలిపాయి. విద్యుత్తు వాడకం పెరగడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక డిమాండ్ వృద్ధిలో స్థిరత్వం కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి :దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
Last Updated : Dec 20, 2020, 12:06 PM IST