దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ, విశ్వవిద్యాలయాల్లో మే నెలలో జరగనున్న అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా విద్యాసంస్థలకు ఆ శాఖ కార్యదర్శి అమిత్ ఖెహార్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఆన్లైన్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేసింది కేంద్రం.