తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణాలో రాజ్​భవన్​ ముట్టడి ఉద్రిక్తం - congress

దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ నేతలు రాజ్​భవన్​ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో హరియాణాలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం భూపీందర్​ సింగ్ హూడా సహా పలువురు నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

HR-CONG-PROTEST
హరియాణలో ఉద్రిక్తత.. జలఫిరంగులతో అదుపులోకి

By

Published : Jan 15, 2021, 6:26 PM IST

హరియాణాలోని ఛండీగఢ్​లో కాంగ్రెస్​ నేతల రాజ్​భవన్​ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో వారిని అదుపు చేసేందుకు జలఫిరంగులు ప్రయోగించారు.

జలఫిరంగులను ఉపయోగిస్తున్న పోలీసులు
మధ్యప్రదేశ్​లో నిరసన

రాజ్​భవన్​ ముట్టడి..

నూతన సాగు చట్టాలు, ఇంధన ధరల పెంపుపై పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ నేతలు రాజ్​భవన్​ల ముట్టడి కార్యక్రమాల్ని శుక్రవారం నిర్వహించారు. కిసాన్ అధికార్​ దివస్​ పేరుతో జరుపుతున్న ఈ నిరసనలో బంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్​​ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి :'రైతు సత్యాగ్రహంలో భాగస్వాములు అవ్వండి'

ABOUT THE AUTHOR

...view details