Police head constable suspended: కర్ణాటక బెంగళూరు అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్.. ఓ మహిళతో నీచంగా ప్రవర్తించాడు. రోడ్డుపై బహిరంగ మూత్ర విసర్జన చేయడమే గాక.. ఆమెకు తన ప్రైవేటు శరీర భాగాలను చూపాడు. ఈ ఆరోపణలకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేశారు. ఐపీసీ సెక్షన్ 354(ఏ), 509 కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
నడిరోడ్డుపై మహిళ ముందు పాడు పని- హెడ్ కానిస్టేబుల్‌పై వేటు
Police head constable suspended: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు బెంగళూరు పోలీసు ఉన్నతాధికారులు. బహిరంగ మూత్ర విసర్జన చేయడమే గాక.. తన ప్రైవేటు శరీర భాగాలను అతడు మహిళకు చూపాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా యళహంక న్యూ టౌన్ హౌసింగ్ బోర్డు సమీపంలో రోడ్డుపై బైక్ ఆపి బహిరంగ మూత్ర విసర్జన చేశాడు చంద్రశేఖర్. ఆ సమయంలో వీధి కుక్కలకు ఆహారం అందించేందుకు ఓ మహిళ బయటకు వచ్చింది. ఆమెను చూసి హెడ్ కానిస్టేబుల్ తన ప్రైవేటు భాగాలను ప్రదర్శించాడు. అంతేగాక ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె కోపోద్రిక్తురాలైంది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. విషయం తెలుసుకున్న పై అధికారులు చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. బెంగళూరు ఈశాన్య డీసీపీ సీకే బాబా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇదీ చదవండి:Actor Vijay IT Raids: హీరో విజయ్ బంధువు ఇంట్లో ఐటీ సోదాలు!