జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. షోపియాన్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల నుంచి మొత్తం ఏడుగురు ఉగ్ర అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరంతా.. నిషేధిత ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కోసం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నారు.
ఏడుగురు 'హిజ్బుల్ ముఠా' అనుచరులు అరెస్ట్ - Over Ground Workers
హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ కోసం పనిచేసే ఏడుగురు అనుచరులను అరెస్టు చేశారు జమ్ముకశ్మీర్ పోలీసులు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ఏడుగురు 'హిజ్బుల్ ముఠా' అనుచరులు అరెస్ట్
ముష్కరుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 3 గ్రనేడ్లు, రెండు ఏకే-47 మేగజైన్లు, పిస్టోళ్లు ఉన్నాయి.
ఇదీ చూడండి: ఉగ్రవాది అరెస్టు- చైనా తుపాకులు స్వాధీనం