తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకా ఉత్పత్తిదారులతో నేడు ప్రధాని భేటీ - టీకా ఉత్పత్తిదారులతో ప్రధాని చర్చలు

టీకా ఉత్పత్తిని పెంచేందుకు వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు భేటీకానున్నారు. వర్చువల్​గా జరగనున్న ఈ సమావేశానికి వ్యాక్సిన్​ తయారీదారులతో పాటు దేశంలోని ప్రముఖ వైద్యులు పాల్గొననున్నారు.

PM, narendramodi
టీకా ఉత్పత్తిదారులతో నేడు ప్రధాని భేటీ

By

Published : Apr 20, 2021, 5:25 AM IST

Updated : Apr 20, 2021, 6:55 AM IST

దేశంలో 18 ఏళ్లు నిండినవారందరికీ టీకా వేసేందుకు కేంద్రం అనుమతించిన వేళ టీకా ఉత్పత్తిని పెంచేందుకు వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన ఔషధ సంస్థల ప్రతినిధులతో ప్రధాని వర్చువల్‌గా భేటీ కానున్నారు.

ఈ సమావేశంలో దేశంలోని ప్రముఖ వైద్యులు కూడా పాల్గొననున్నారు. ఇప్పటి వరకు దేశంలో కొవాక్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వీ టీకాలు అత్యవసర వినియోగానికి ఆమోదం పొందాయి. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వినియోగంలో ఉన్న జాన్సాన్ అండ్ జాన్సన్, ఫైజర్, మోడెర్నా టీకాలు భారత్‌లో ప్రవేశించేందుకు కేంద్రం అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం కానున్న మోదీ టీకా ఉత్పత్తిని పెంచడంపై చర్చలు జరపనునున్నారు.

ఇదీ చూడండి:18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకా

Last Updated : Apr 20, 2021, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details