తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత ప్రగతికి ఆటంకం.. వలసవాద మనస్తత్వం' - మోదీ స్పీచ్​

వలసవాద మనస్తత్వం అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రగతికి ఆటంకంగా నిలుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. పారిస్​ ఒప్పందంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చిన ఏకైక దేశం భారతేనని స్పష్టం చేశారు.

modi on  Constitution Day
ప్రధాని మోదీ

By

Published : Nov 26, 2021, 7:52 PM IST

భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో పాటు వలసవాద మనస్తత్వం కారణంగా భారత అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం వేదిక ఈ వ్యాఖ్యలు చేశారు.

"వలసవాద మనస్తత్వం ఇంకా ఉంది. ఈ వలసవాదాన్ని ప్రోత్సహించే శక్తులు.. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయి. పారిస్​ ఒప్పందంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చిన ఏకైక దేశం మనది. అయినప్పటికీ.. పర్యావరణం పేరుతో భారత్​పై అనేక రకాలుగా ఒత్తిడికి గురిచేస్తున్నారు. దీనికంతటికీ వలసవాద మనస్తత్వమే కారణం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

'దురదృష్టవశాత్తు మన దేశంలోనూ.. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొన్నిసార్లు దేశ ప్రగతికి ఈ వలసవాదం ఆటంకంగా నిలుస్తోంది' అని మోదీ చెప్పారు.

"సబ్​ కా సాత్​​, సబ్​కా వికాస్​, సబ్​కా విశ్వాస్​, సబ్​కా​ ప్రయాస్​" అనే సూత్రం.. రాజ్యాంగం స్ఫూర్తికి చిహ్నం అని మోదీ పేర్కొన్నారు. రాజ్యంగానికి కట్టుబడి తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. అభివృద్ధి ఫలాలను ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమానంగా అందిస్తున్నామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details