ఉత్తర్ప్రదేశ్ సుల్తాన్పుర్లో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన అనంతరం అక్కడ నిర్వహించిన ఎయిర్ షోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news) వీక్షించారు. ఏఎన్-32 విమానం, ఫైటర్ జెట్‌లు సుఖోయ్-30 ఎంకేఐ, మిరాజ్-2000 వంటి యుద్ధవిమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొని.. ఎక్స్‌ప్రెస్ వేపై దిగాయి.
340.8 కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే లఖ్‌నవూ-సుల్తాన్‌పూర్ హైవేలోని చాంద్‌సరాయ్ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. బారాబంకి, అమేథీ, సుల్తాన్‌పూర్, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, ఆజంఘర్, మవూ ప్రాంతాలను కలుపుతూ చివరకు గాజీపుర్ జిల్లాలోని హల్దారియా వద్ద ముగుస్తుంది.