రాజస్థాన్ పాళీ జిల్లాలోని విజయ వల్లభ సాధన కేద్రంలో 'స్టాట్యూ ఆఫ్ పీస్' విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
"గుజరాత్ నేల ఇద్దరు వల్లభులను ఇచ్చిందని విజయ విజయ నిత్యానంద్ సురేశ్వర్ మహారాజ్ చెప్పేవారు. ఒకరు రాజకీయ రంగానికి చెందిన సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ కాగా.. ఆధ్యాత్మిక రంగానికి చెందిన విజయ వల్లభ్ మహారాజ్ మరొకరు. ఇద్దరూ దేశ ఐక్యత, సౌభ్రాతృత్వం కోసం జీవితాల్ని అంకితం చేశారు. సర్దార్ పటేల్ 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ', జైనాచార్య విజయ వల్లభ్ 'స్టాట్యూ ఆఫ్ పీస్' విగ్రహాలను ఆవిష్కరించే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. మానవత్వం, శాంతి, అహింస, సౌభ్రాతృత్వానికి భారత దేశం ఉదాహరణగా నిలుస్తోంది. యావత్ ప్రపంచం మనవైపు చూస్తోంది."