తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డిజిటల్ ఇండియా లబ్ధిదారులతో మోదీ మాటామంతి

డిజిటల్ ఇండియా లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ.. గురువారం మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరగనున్న ఈ కార్యక్రమంలో పలు పథకాల లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు. అలాగే జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా.. వైద్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

MODI
మోదీ

By

Published : Jul 1, 2021, 4:59 AM IST

డిజిటల్ ఇండియా లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ.. జులై 1న(గురువారం) మాట్లాడనున్నారు. డిజిటల్​ ఇండియా ఆరో వార్షికోత్సవం సందర్భంగా.. పలు పథకాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రధాని మాట్లాడనున్నారని ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

దీనిలో భాగంగా డిజిటల్​ ఇండియా సాధించిన విజయాలు, ప్రభుత్వానికి ప్రజలను దగ్గర చేయడంలో డిజిటల్ ఇండియా పాత్ర.. అలాగే ఈ పథకం భవిష్యత్ కార్యచరణ గురించి వివరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ సహా పలువురు నేతలు, అధికారులు హాజరుకానున్నారు.

వైద్యులను ఉద్దేశించి మోదీ ప్రసంగం

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. భారత వైద్య సంఘం(ఐఎంఏ) నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన మాట్లాడనున్నారు. ప్రముఖ వైద్య నిపుణుడు, బంగాల్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత బిధాన్ చంద్రరాయ్ గౌరవార్థం జులై ఒకటో తేదీని వైద్యుల దినోత్సవంగా జరుపుకొంటారు.

తన ప్రసంగం గురించి మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "కొవిడ్-19 కట్టడిలో వైద్యుల కృషి పట్ల భారత్ గర్వంగా ఉంది. వారి సేవలకు గుర్తుగా జులై ఒకటోతేదీని వైద్యుల దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఐఎంఏ నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నాను" అని తెలిపారు.

ఇదీ చూడండి:కరోనాపై కేంద్ర మంత్రులకు మోదీ కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details