తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ కీలక భేటీ - రెమ్​డిసివిర్

కొవిడ్ 19 పరిస్థితిపై సోమవారం కీలక భేటీకి హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో మెడికల్ ఆక్సిజన్, రెమ్​డెసివర్​ కొరతలపై రాష్ట్రాల సీఎంల నుంచి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

PM Modi to chair key meeting, Covid-19 situation
కరోనా పరిస్థితి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ

By

Published : Apr 19, 2021, 11:43 AM IST

దేశవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆక్సిజన్ సరఫరా, రెమ్​డెసివర్‌ ఇంజక్షన్ల కొరతపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

మహమ్మారి విజృంభణపై చర్యలకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు మోదీ. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన జాబితా మేరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటిన్నర దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్య 19 లక్షలకు చేరింది.

ఇదీ చూడండి:రెమ్‌డెసివిర్‌పై 'మహా' జగడం!

ABOUT THE AUTHOR

...view details