PM Modi Speech Today : విపక్ష కూటమి 'ఇండియా' కూటమిలో చీలికలు బయటపడతాయనే భయంతోనే విపక్షాలు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందుకు రాలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి.. ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించాలనుకున్న విపక్షాలకు గట్టి సమాధానం ఇచ్చామని తెలిపారు. బీజేపీ క్షత్రియ పంచాయతీ రాజ్ పరిషద్ కార్యకర్తలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
"అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ప్రతిపక్షాలు పాల్గొనలేదు. ఎందుకంటే ఓటింగ్ పాల్గొంటే తమ కూటమిలో విభేదాలు బహిర్గతం అవుతాయని వారికి తెలుసు. అందుకే ఓటింగ్ సమయంలో లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. మణిపుర్‌పై ప్రతిపక్షాలు చర్చను కోరుకోలేదు. కేవలం రాజకీయాలు చేయాలనుకున్నారు."
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని
Narendra Modi On Congress : కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కొన్ని దశాబ్దాల క్రితం 'గరీబీ హఠావో' అనే నినాదాన్ని ఓ పార్టీ ఇచ్చిందని.. కానీ పేదరికాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఏమీ చేయలేదని అన్నారు. దేశంలోని పేదల అభ్యున్నతికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.
బంగాల్‌లో రక్తపాత రాజకీయాలు..
బంగాల్‌లో రక్తపాత రాజకీయాలు జరుగుతున్నాయని మమతా బెనర్జీ సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ అనేక విధాలుగా ప్రయత్నించిందని మోదీ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినప్పుడు ఊరేగింపునకు టీఎంసీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అన్నారు. టీఎంసీ పార్టీ ఓట్ల లెక్కింపు రోజున బూత్‌లను స్వాధీనం చేసుకునేందుకు గూండాలకు కాంట్రాక్టులు ఇచ్చిందని విమర్శించారు. కౌంటింగ్ సమయంలో బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఎద్దేవా చేశారు.
కేంద్రంపై మమత ఫైర్..
కేంద్ర ప్రభుత్వంపై బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. మణిపుర్లో అఘాయిత్యాలకు పాల్పడినవారిపై బీజేపీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ అవినీతిపై మాట్లాడలేరని.. ఎందుకంటే ఆయన నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఎటువంటి ఆధారాలు లేకుండా విపక్షాలపై నిందలు వేస్తున్నారని అన్నారు.
'కాంగ్రెస్ కుటిల రాజకీయాలే ఈశాన్య రాష్ట్రాల్లో చిచ్చురేపాయ్.. మణిపుర్లో శాంతి నెలకొంటుందని హామీ ఇస్తున్నా'
PM Modi Today Speech : 'విపక్షాల కళ్లు మూసుకుపోయాయ్.. 'ఇండియా' కూటమికి త్వరలోనే 'తాళం''