అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించారు. ఈ విషయాన్ని ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇరువురు కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు మోదీ.
"అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్‌తో ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలియజేశాను. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి ఇరువురు కట్టుబడి ఉన్నాము. కరోనా సంక్షోభం, వాతావరణ మార్పు, ఇండో-పెసిఫిక్ ప్రాంతంలో సహకారం వంటి కీలక అంశాలపై చర్చించాము."
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను బైడెన్ ఓడించిన అనంతరం డెమొక్రటిక్ నేతతో మోదీ మాట్లాడటం ఇదే తొలిసారి.