తెలంగాణ

telangana

Mann Ki Baat Modi: 'ఆ బాధ్యత దేశ ప్రజలపై ఉంది'

By

Published : Sep 26, 2021, 11:28 AM IST

Updated : Sep 26, 2021, 1:13 PM IST

అర్హులైన వారందరూ టీకా తీసుకునే విధంగా చూసుకునే బాధ్యత దేశ ప్రజలపై ఉందన్నారు మోదీ. మన్​-కీ బాత్​లో(mann ki baat today ) ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నదులను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కృషి చేయాలన్నారు ప్రధాని (Mann Ki Baat Modi). ప్రపంచ నదుల దినోత్సవం (Rivers day 2021) సందర్భంగా.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.

mann ki baat
నరేంద్ర మోదీ

దేశంలో అర్హులైన ఏ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ అనే సురక్షా వలయం బయట ఉండకుండా చూడాల్సిన బాధ్యత అందరిది అని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. మన్‌ కీ బాత్‌ (mann ki baat today )ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. రాబోయేది పండగల కాలం అయినందున ఆ సమయంలో ప్రజలంతా కొవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని సూచించారు.

ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. వీటిని కాలుష్య రహితంగా మార్చేందుకు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశప్రజలు ఏటా ఒక్కసారైనా 'నదీ ఉత్సవాలు' జరుపుకోవాలని సూచించారు. ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవం(Rivers day 2021) సందర్భంగా.. మనసులో మాట(మన్​ కీ బాత్​) కార్యక్రమం వేదికగా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

జాతిపిత మహాత్మాగాంధీ స్వచ్ఛత అనే నినాదాన్ని బలంగా వినిపించారని, ఈ కార్యక్రమాన్ని సామూహిక జన ఉద్యమంగా మార్చి, స్వాతంత్ర్య పోరాటంతో జత చేశారని గుర్తు చేశారు. అక్టోబర్‌ 2న జాతిపిత మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఖాదీ కొనుగోలు చేయాలని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంలో భారత్‌ రోజుకో రికార్డు సృష్టిస్తోందని మోదీ తెలిపారు.

ప్రతి నెల చివరి ఆదివారం ఈ మన్​-కీ బాత్​(Mann Ki Baat Modi) కార్యక్రమం నిర్వహిస్తారు మోదీ. నెల మొత్తం దేశ,విదేశాల్లో జరిగిన ఘటనలతో పాటు వివిధ కీలక అంశాలను ప్రస్తావిస్తారు.

ఇదీ చూడండి:-Mann Ki Baat: 'అదే ధ్యాన్​ చంద్​కు ఇచ్చే గొప్ప నివాళి'

Last Updated : Sep 26, 2021, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details