PM Modi On Vaccination: వ్యాక్సినేషన్లో భారత్ కీలక ఘట్టానికి చేరుకుందని ప్రధాని మోదీ తెలిపారు. శుక్రవారం దేశవ్యాప్తంగా 150కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ పూర్తయిందన్నారు. పేదలకు వైద్యపరమైన ప్రయోజనాలను అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కోల్‌కతాలోని చిత్తరంజన్ నేషనల్ కేన్సర్ ఇన్స్‌స్టిట్యూట్ రెండో క్యాపస్ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు మోదీ.
"దేశంలోని వయోజనుల జనాభాలో 90శాతానికిపైగా కొవిడ్ తొలి డోసు పూర్తయింది. కేవలం 5రోజుల్లోనే కోటిన్నరకు పైగా 15-17ఏళ్ల పిల్లలకు కొవిడ్ మొదటి డోసు పూర్తయింది. ఈ విజయం భారత్ ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ విజయాన్ని అందుకోవడం ధనిక, అభివృద్ధి చెందిన దేశాలకూ సాధ్యం కాదు. ఆయుష్మాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 2.60కోట్ల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. అందులో 17లక్షల మంది కేన్సర్ బాధితులు కూడా ఉన్నారు."
-- ప్రధాని నరేంద్రమోదీ