తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొవిడ్ ఓ కుట్రధారి.. క్రియాశీల వ్యూహాలతోనే కట్టడి'

కొవిడ్​-19 మహమ్మారిని అరికట్టేందుకు అనుసరించే వ్యూహాలు.. క్రియాశీలకంగా, సరికొత్తగా, ఎప్పటికప్పుడు మార్పు చెందే విధంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని జిల్లా కలెక్టర్​లు, క్షేత్రస్థాయి అధికారులతో మోదీ సమావేశమయ్యారు.

pm modi
ప్రధాని నరేంద్ర మోదీ

By

Published : May 20, 2021, 1:47 PM IST

Updated : May 20, 2021, 2:03 PM IST

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అనుసరించే వ్యూహాలు.. క్రియాశీలకంగా, సరికొత్తగా ఉండాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని జిల్లా కలెక్టర్​లు, క్షేత్రస్థాయి అధికారులతో మోదీ సమావేశమయ్యారు. వైరస్​ను 'కుట్రధారి', 'బహురూపకారి'గా అభివర్ణించారు. రానున్న రోజుల్లో యువత, చిన్నారులపై వైరస్ అధిక ప్రభావం చూపుతుందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో.. అధికారులు దృష్టిసారించాలని సూచించారు.

"జిల్లాల్లో మహమ్మారి వ్యాప్తిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి వైరస్ తీవ్రతను అంచనా వేయాలి. వ్యాక్సిన్​ దుర్వినియోగాన్ని అరికట్టాలి. ప్రతి డోసు.. మరొకరి ప్రాణానికి రక్షణ. నూతన సవాళ్లే.. సరికొత్త పరిష్కారాలను చూపుతాయి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ప్రస్తుతం ఉన్న వనరులను ఉపయోగించుకుని వైరస్​ను సమర్థవంతంగా కట్టడి చేస్తున్న జిల్లా అధికారులను మోదీ ప్రశంసించారు. కేసులు తగ్గినా.. వైరస్​ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేంత వరకూ కృషి చేయాలని సూచించారు.

ఇదీ చదవండి :పల్లె ప్రాంతాల్లో కరోనా కట్టడి ముఖ్యం!

Last Updated : May 20, 2021, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details