తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే.. అభివృద్ధికి ఆటంకం'

Modi Tripura Visit: త్రిపుర రాజధాని అగర్తలాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఇంతకుముందు ప్రభుత్వాలు.. అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని, తాము సరైన పథంలో తీసుకెళ్తున్నామని అన్నారు.

Tripura airport
Tripura airport

By

Published : Jan 4, 2022, 4:58 PM IST

Modi Tripura Visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రిపురలో పర్యటించారు. అగర్తలాలో మహారాజా వీర్​​ విక్రమ్​ విమానాశ్రయంలో రూ. 3,400 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్​ టెర్మినల్​ బిల్డింగ్​ను ప్రారంభించారు. అనంతరం.. అధికారులతో కలిసి అక్కడే కలియతిరిగారు. అభివృద్ధి పనులను దగ్గరుండి పరిశీలించారు.

అగర్తలాలోని విమానాశ్రయంలో మోదీ

ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ్​ సమృద్ధి యోజన, విద్యాజ్యోతి స్కూల్స్​ ప్రాజెక్ట్​ మిషన్​ 100 వంటి కీలక కార్యక్రమాలను కూడా ప్రారంభించారు మోదీ. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జోతిరాధిత్య సింధియా, త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్​ కుమార్​ దేవ్​ కూడా మోదీ వెంట ఉన్నారు.

కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్​ టెర్మినల్​ బిల్డింగ్​
మోదీ ర్యాలీకి హాజరైన జనం

ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై తీవ్ర ఆరోపణలు చేశారు మోదీ. గత ప్రభుత్వాలకు రాష్ట్ర అభివృద్ధిపై.. ఎలాంటి ముందుచూపు లేదని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు తమ హయాంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఈశాన్యానికి త్రిపుర గేట్​వే అవుతుందని అన్నారు.

''త్రిపుర హెచ్​ఐఆర్​ఏ (హెచ్​- హైవేలు, ఐ- ఇంటర్​నెట్​ వే, ఆర్​-రైల్వేలు, ఏ- ఎయిర్​పోర్ట్​లు) మోడల్​ అభివృద్ధికి నేను హామీ ఇస్తున్నా.'కిసాన్​ రైలు ద్వారా.. త్రిపుర సేంద్రియ కూరగాయలు, పండ్లను దేశం మొత్తానికి ఎగుమతి చేస్తోంది. ఇక్కడి వెదురు ఉత్పత్తులకు దేశంలో మంచి మార్కెట్​ ఏర్పడింది.''

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇవీ చూడండి:Covid Third wave: 'దేశంలో కేసుల పెరుగుదల.. మూడోదశకు సంకేతాలు'

తుపాకులు, త్రివర్ణ పతాకంతో గల్వాన్​లో జవాన్ల న్యూఇయర్

ABOUT THE AUTHOR

...view details