Deoghar Rescue Operation: ఝార్ఖండ్ దేవ్‌ఘర్ త్రికూట పర్వతాల వద్ద జరిగిన రోప్‌వే ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. ఆ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, వాయుసేన, ఐటీబీపీ, స్థానిక యంత్రాంగంతో వర్చువల్‌గా మాట్లాడారు ప్రధాని. ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా.. ప్రజలను కాపాడగలిగేలా నైపుణ్యాలు ఉన్న బలగాలు ఉన్నందుకు దేశం గర్విస్తోందన్నారు. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుంటామని, భవిష్యత్తులో తమ అనుభవాలు ఉపయోగపడతాయని సిబ్బందిని ఉద్దేశించి అన్నారు మోదీ.
''3 రోజుల వ్యవధిలో.. మీరు ప్రతి క్షణం పనిచేసి కష్టతరమైన ఆపరేషన్‌ను పూర్తిచేశారు. ఎందరో పౌరుల ప్రాణాలను కాపాడారు. మీ వీరోచిత ప్రయత్నాలను చూసి దేశం మొత్తం అభినందిస్తోంది. కొంతమంది ప్రాణాలు కాపాడలేకపోయినందుకు మేం విచారం వ్యక్తం చేస్తున్నాం.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి