తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నుల పండుగలా 'ఛఠ్​ పూజ' ఉత్సవాలు

ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో 'ఛఠ్​ పూజ' మూడో రోజు అంగరంగ వైభవంగా జరిగింది. ప్రజలు భక్తి శ్రద్ధలతో సూర్యభగవానుడికి పూజలు నిర్వహించారు. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఛఠ్​పూజ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi greets people on Chhath
కన్నుల పండుగలా ఉత్తరాది 'ఛఠ్​ పూజ' ఉత్సవాలు

By

Published : Nov 20, 2020, 10:43 PM IST

ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో ఛఠ్ పూజ సంబరాలు మిన్నంటాయి. ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఉత్సవాల్లో పాల్గొన్నారు. నదీతీర ప్రాంతాల్లో కన్నుల పండుగలా ఛఠ్ పూజను నిర్వహించారు భక్తులు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సూర్యుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

బంగాల్​లో ఛఠ్ పూజ ఉత్సవాలు
భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్న భక్తులు
వైభవంగా ఉత్సవాలు
నదీ స్నానం ఆచరించి
జనసందోహం

"ఛఠ్ పూజ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఈ పండగ మీ జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నా".

--ప్రధాని నరేంద్ర మోదీ.

"ఛఠ్​ పూజ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. సూర్యభగవానుడిని ప్రార్థించటం దేశంలో తరతరాలు గా వస్తున్న ఆచారం. ఇది భారత సంస్కృతిలో భాగం. కొవిడ్​-19 జాగ్రత్తలు పాటిస్తూ పండగ జరుపుకోవాలని ప్రజలను కోరుతున్నాను."

--సోనియాగాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

మధ్యప్రదేశ్​లో ఛఠ్​పూజ సంబరాలు
మధ్యప్రదేశ్​లో ఛఠ్ ఉత్సవాలు
మధ్యప్రదేశ్​లో ఛఠ్​పూజ సంబరాలు
కన్నుల పండుగలా
ప్రత్యేక పూజలు
ఛఠ్ పూజ నిర్వహిస్తున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​
పోటెత్తిన భక్తులు

మధ్యప్రదేశ్​, పశ్చిమ్​ బంగా, ఝార్ఖండ్​, ముంబయిలో ప్రజలు సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​ ఛఠ్​ పూజలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details