WHO director general new Name: ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ గెబ్రెయెసస్ అధనోమ్కు కొత్త పేరు పెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గాంధీనగర్లో జరుగుతున్న మూడు రోజుల గ్లోబల్ ఆయూష్ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్ సమ్మిట్ ప్రారంభోత్సవ వేదికగా.. బుధవారం టెడ్రోస్ను 'తులసీ భాయ్'గా పిలిచారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. తులసి మొక్క భారత ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమని పేర్కొన్నారు. డాక్టర్ గెబ్రెయెసస్ తనకు గుజరాతీ పేరు కావాలని కోరినట్లు చెప్పారు.
"ఈరోజు ఉదయం టెడ్రోస్ నన్ను కలిసినప్పుడు తను పక్కా గుజరాతీగా మారిపోవాలనుకుంటున్నట్లు చెప్పారు. గుజరాతీ పేరు ఇవ్వాలని కోరారు. మహాత్మాగాంధీ నడయాడిన ఈ పుణ్యభూమిలో పుట్టిన నేను, ఒక గుజరాతీగా నా ప్రాణ స్నేహితుడిని తులసీ భాయ్ అని పిలుస్తాను. తులసి మొక్క భారత ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగం.. తరతరాలుగా పూజలు చేస్తున్నాం. దీపావళి సమయంలో తులసి వివాహం ఉత్సవాలు నిర్వహిస్తాం."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.