ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మృతిపట్ల సంతాపం తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. కల్యాణ్ సింగ్ దూరం కావడం మాటల్లో చెప్పలేనంత బాధగా ఉందని అన్నారు.
తీవ్ర అనారోగ్య సమస్యలతో గత కొన్నాళ్లుగా బాధపడుతున్న కల్యాణ్‌సింగ్.. లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస(Kalyan Singh news) విడిచారు.
"కల్యాణ్ సింగ్ రాజనీతిజ్ఞుడు, మానవతా విలువలున్న వ్యక్తి. అట్టడుగు స్థాయి నుంచి గొప్ప నేతగా ఎదిగారు. ఉత్తర్‌ప్రదేశ్ అభివృద్ధిలో కల్యాణ్ సింగ్ పాత్ర ఎనలేనిది."
--నరేంద్ర మోదీ, ప్రధాని.
కల్యాణ్ సింగ్ తనయుడు రాజ్వీర్ సింగ్‌తో మాట్లాడిన మోదీ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రముఖుల సంతాపం..
"కల్యాణ్‌సింగ్ ప్రజాధరణ కలిగిన నాయకుడు. యూపీ ముఖ్యమంత్రిగా, రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఎదిగారు. అవినీతిని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఓ మంచి నాయకుడిని కోల్పోయిన వెలితి ప్రజల్లో ఎప్పటికీ ఉంటుంది."
--రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి.