తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య రైల్వేస్టేషన్, ఎయిర్​పోర్టును ప్రారంభించిన మోదీ - modi latest speech

PM Modi Ayodhya Visit : ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ఆధునిక హంగులతో పునరుద్ధరించిన రైల్వేస్టేషన్‌తోపాటు మహర్షి వాల్మీకి ఎయిర్​పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు. రెండు అమృత్‌ భారత్‌ రైళ్లు, ఆరు వందేభారత్‌ రైళ్లకు పచ్చజెండా ఊపారు.

PM Modi Ayodhya Visit
PM Modi Ayodhya Visit

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 12:10 PM IST

Updated : Dec 31, 2023, 3:17 PM IST

PM Modi Ayodhya Visit : ఆధునిక హంగులతో పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్​తో పాటు మహర్షి వాల్మీకి ఎయిర్​పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటు చేసిన 'జన్‌ సభ'లో మోదీ పాల్గొన్నారు.

శనివారం ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి ఆయన రోడ్‌ షోలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్‌ వరకు 15 కిలోమీటర్ల దూరం జరిగిన ఈ రోడ్‌ షోలో దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం పలికారు. మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.

అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభం
అనంతరం రోడ్​షో ద్వాారా అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్​కు చేరుకుని ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వెంట రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సీఎం యోగి అదిత్యనాథ్ ఉన్నారు. రైల్వేస్టేషన్ వివరాలను ప్రధానికి కేంద్ర మంత్రి వివరించారు. ఇక్కడి నుంచే రెండు అమృత్ రైళ్లు, ఆరు వందే భారత్‌ రైళ్లకు కూడా పచ్చ జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు. అనంతరం రైలు లోపలకు వెళ్లి చిన్నారులతో ముచ్చటించారు.

అయోధ్య రైల్వేస్టేషన్ ముఖద్వారంపై మకుటం, గోడలపై విల్లు తరహా నిర్మాణాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. స్టేషన్ నిర్మాణానికి కాంక్రీటుతో పాటు సున్నపురాయితో చేసిన పిల్లర్లు ఉపయోగించారు. ఇవి స్టేషన్​కు సంప్రదాయ శోభను ఇస్తున్నాయి. ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించారు. 240 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన మూడు అంతస్తుల ఈ ఆధునిక రైల్వే స్టేషన్ భవనంలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజ అవసరాల కోసం దుకాణాలు వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

జాతికి ఎయిర్​పోర్ట్​ అంకితం
మరోవైపు, అయోధ్యలో రామ మందిరానికి వచ్చే భక్తుల తాకిడిని తట్టుకునేలా నూతనంగా నిర్మించిన ఎయిర్​పోర్ట్​ను కూడా మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, సీఎం యోగి అదిత్యనాథ్ తదితరులు ఉన్నారు. ఎయిర్​పోర్ట్ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సింథియాను అడిగి తెలుసుకున్నారు మోదీ.

మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసిన అయోధ్య ఎయిర్​పోర్ట్​ను రూ.1450 కోట్ల వ్యయంతో నిర్మించారు. అంతర్జాతీయ ప్రయాణాలకు అనువుగా దీని నిర్మాణం చేపట్టారు. ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఎయిర్​పోర్ట్​ను సిద్ధం చేశారు. అయోధ్య రామ మందిరాన్ని పోలి ఉండేలా ఎయిర్​పోర్ట్ ముఖభాగం ఉండగా - రాముడి జీవితాన్ని వర్ణించేలా ఇంటీరియర్​ను డిజైన్ చేశారు. రామాయణంలోని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకొని వేసిన మ్యూరల్ పెయింటింగ్​లు ఎయిర్​పోర్ట్​లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఆమె ఇంట్లో టీ తాగిన మోదీ!
అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్ వద్దకు వెళ్లిన ప్రధాని కొద్దిసేపు అక్కడ గడిపారు. ఈ క్రమంలోనే PM ఉజ్వల పథకం లబ్ధిదారుని ఇంటికి కూడా వెళ్లి వారి నివాసంలో టీ తాగారు. "నేను చాలా సంతోషించాను. 'దేవుడు' నా ఇంటికి ఇలా వస్తాడని నేనెప్పుడూ ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది" అని మీరా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని ఆయనతో సెల్ఫీలు దిగిన ఇద్దరు చిన్నారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రామమందిరం ఓపెనింగ్​కు 10కోట్ల కుటుంబాలకు ఆహ్వానం- విదేశాల్లోని హిందువులకు కూడా!

ఆధునిక వసతులు, ఆధ్యాత్మిక శోభతో అయోధ్య ఎయిర్​పోర్ట్- ఆలయంలా రైల్వే స్టేషన్!

Last Updated : Dec 31, 2023, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details