భారత్‌ను ఆత్మనిర్భర్‌గా మార్చేందుకు సరకు రవాణా కారిడార్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రైతులు, వ్యాపారులు, వినియోగదారులతో పాటు ప్రతి ఒక్కరూ దీనివల్ల ప్రయోజనం పొందుతారని చెప్పారు.
'ఆత్మనిర్భర్ భారత్‌కు సరకు రవాణా కీలకం' - modi news update
దేశం స్వయంసమృద్ధి సాధించేందుకు సరకు రవాణా కారిడార్లు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో నూతనంగా నిర్మించిన సరకు రవాణా కారిడార్లను ప్రారంభించారు.
'ఆత్మనిర్భర్ భారత్‌కు సరకు రవాణా కీలకం'
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈడీఎఫ్‌సీ(ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్)లో భాగంగా నిర్మించిన.. భూపుర్- న్యూ-ఖుర్జ భాగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు మోదీ. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన ఈడీఎఫ్‌సీ ఆపరేషన్ కంట్రోల్‌ను సైతం ఆవిష్కరించారు.
రూ. 5,750 కోట్లతో 351 కి.మీ మేర నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తర్‌ప్రదేశ్‌లో స్థానిక పరిశ్రమలను అనుసంధానించేందుకు వీలు కలుగుతుంది.
Last Updated : Dec 29, 2020, 12:12 PM IST