తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బహుముఖాభివృద్ధి దిశగా వారణాసి: మోదీ

వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేడు శంకుస్థాపన చేశారు. వీటిలో ముఖ్యంగా వ్యవసాయ, పర్యటక, నిర్మాణ రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఉన్నాయి.

PM inaugurates, lays foundation stone of development projects for Varanasi
బహుముఖాభివృద్ధి దిశగా వారణాసి: మోదీ

By

Published : Nov 9, 2020, 12:59 PM IST

ప్రధాని నరేంద్రమోదీ వారణాసిలో రూ. 614 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ, పర్యటక, నిర్మాణ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు వర్చువల్​గా శిలాఫలకం వేశారు.

ఈ కార్యక్రమంలో ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన లబ్ధిదారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​లో నేరుగా మాట్లాడారు.

వారణాసి ప్రజలకు శుభాకాంక్షలు. శరవేగంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంతానికి రోజువారీ విమాన సర్వీసులు మెరుగుపరచడం వల్ల నేడు వాటి సంఖ్య 48కి పెరిగింది. ఈ క్రమంలో పర్యటకుల తాకిడి కూడా రెట్టింపు అయ్యింది. దశాశ్వమేధ ఘాట్​ టూరిస్ట్​ ప్లాజాగా పర్యటకులను అలరించనుంది. మీ ముఖ్యమంత్రి, అక్కడి అధికార యంత్రాంగం పనితీరుతో ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి. గంగా ప్రక్షాళణ, మౌలిక సదుపాయాల కల్పనతో బహుముఖాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నాను. కాశీ కేంద్రం ప్రతి రంగంలో దూసుకుపోతోంది. కాశీనాథుని దయతో ప్రజలు వైరస్​పై పోరాడుతున్నారు.

-నరేంద్ర మోదీ, ప్రధాని

ప్రాజెక్టులు ఇవే..

సార్​నాథ్​ లైట్​ అండ్​ సౌండ్​ ప్రదర్శనశాల, రామ్​నగర్​లోని లాల్​ బహదూర్​ శాస్త్రి ఆసుపత్రి పునరుద్ధరణ, నగరంలో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులు, విత్తనాల స్టోరేజీ కేంద్రం, సంపూర్ణానంద్​ స్టేడియం శంకుస్థాపన, 105 అంగన్​వాడీ కేంద్రాలు, 102 గోవు సంరక్షణ కేంద్రాలు, పలు ఘాట్​ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.

ఇదీ చూడండి:వారణాసిలో 614 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details