తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర మంత్రులతో మోదీ భేటీ.. పలు సమస్యలపై చర్చ - ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూస్ టుడే

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పథకాల అమలులో అవలంబించాల్సిన మెరుగైన విధానాల గురించి చర్చించారు.

pm modi
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రుల భేటీ

By

Published : Sep 14, 2021, 10:45 PM IST

Updated : Sep 15, 2021, 12:35 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రుల సమావేశం జరిగింది. రాష్ట్రపతి భవన్​లో​ సుమారు ఐదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో.. వివిధ పథకాలపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. పథకాల అమలు కోసం మెరుగైన విధానాల గురించి చర్చించారు. కేంద్ర మంత్రులు మన్​సుఖ్​ మాండవీయ, ధర్మేంద్ర ప్రధాన్​ వారి మంత్రిత్వ శాఖల పనితీరును మోదీకి వివరించారు.

ఈ సందర్భంగా.. సమస్యలను ఎదుర్కోవడం, సమయ పాలన వంటి విషయాలపై మంత్రులకు పలు సూచనలు చేశారు ప్రధాని. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. పాలనలో వేగం పెంచేందుకు కృషి చేయాలన్నారు. మెరుగైన పాలనకు సిబ్బంది ఎంపిక కూడా కీలకమేనని సూచించారు.

చింతన్ శివిర్..

సరళతర జీవన విధానాన్ని ప్రతీఒక్కరూ అలవరచుకోవాలనే నినాదాన్నిచ్చేలా ఈ సమావేశాలకు 'చింతన్ శివిర్' అని పేరు పెట్టారు. వివిధ మంత్రిత్వ శాఖలతో ఈ తరహా సమావేశాలు మరో నాలుగు నిర్వహించనున్నారు మోదీ.

ఇదీ చూడండి :భద్రతాదళాలపై భీకర దాడులు జరిపిన మావోయిస్టు​ అరెస్ట్​

Last Updated : Sep 15, 2021, 12:35 AM IST

ABOUT THE AUTHOR

...view details