తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోయలో పడ్డ బస్సు- 18 మంది ప్రాణాలను కాపాడిన చెట్లు!

Trees saved passengers life: 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. అయితే, లోయలో ఉన్న చెట్లు బస్సును పూర్తిగా కింద పడకుండా అడ్డుకున్నాయి. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

Pine trees saved life of 18 bus passengers in Almora district
లోయలో పడ్డ బస్సు

By

Published : Jan 11, 2022, 7:56 PM IST

Uttarakhand bus accident: ఉత్తరాఖండ్​ అల్మోరా జిల్లాలో తృటిలో ఘోర ప్రమాదం తప్పినట్లైంది. 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఓ లోయలో పడింది. అయితే, లోయలో దట్టంగా ఉన్న పైన్ చెట్లు... బస్సును మరింత కిందకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. దీంతో బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి.

Almora Bus accident pine trees

రామ్​నగర్ నుంచి సరిఖేత్​కు వెళ్తున్న బస్సు.. దోతియాల్ చౌక్ వద్ద ఆగింది. స్థానిక దాబాలో భోజనం చేసిన తర్వాత బయల్దేరిన బస్సు వంద మీటర్ల దూరంలోని లోయలో పడిపోయింది.

బస్సు స్ప్రింగ్ బ్లేడ్లు విరిగిపోవడం వల్ల.. వాహనంపై డ్రైవర్ పట్టుకోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు రోడ్డు అంచున ఉండే అడ్డుగోడను ఢీకొట్టి లోయలో పడింది. అయితే, బస్సు పూర్తిగా లోయలోకి జారుకోకుండా చెట్లు అడ్డుకున్నాయి.

ధోతియాల్ మార్కెట్ వద్ద ఉన్న ప్రజలు ప్రమాదం శబ్దం విని ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:పామును మింగేందుకు మరో పాము యత్నం.. చివరకు..

ABOUT THE AUTHOR

...view details