తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బతికుండగానే పెద్ద కర్మ- పత్రికలతో ఆహ్వానించి చావు భోజనం- కారణం అదే! - బతికుండగానే చావు విందు

Person Performed His Own Last Rites : ఓ వ్యక్తి తాను బతికి ఉండగానే తన మరణాంతర కార్యక్రమాలను జరిపించుకున్నాడు. పత్రికలతో అహ్వానించి మరీ చావు విందు ఏర్పాటు చేశాడు. ఈ పరిస్థితికి దారితీసిన కారణాలను వివరించాడు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఎటా జిల్లాలో జరిగింది.

Person Performed His Own Last Rites
Person Performed His Own Last Rites

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 8:25 PM IST

Person Performed His Own Last Rites : ఓ వ్యక్తి జీవించి ఉండగానే తన మరణాంతర కర్మలను తానే నిర్వహించుకున్నాడు. తన చావు విందుకు పత్రికలతో అహ్వానించి మరీ స్థానికులకు భోజనాలు ఏర్పాటు చేశాడు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఎటా జిల్లాలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే ఇలా ఎందుకు చేశావు అని ప్రశ్నించగా అందుకు గల కారణాలను వివరించాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే?
ఎటా జిల్లాలో కస్బా సకీట్​ మండలంలోని మొహల్లా ముషినగర్​లో బంకేలాల్​ కుమారుడు హకీమ్​ సింగ్ (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే హకీమ్​ సింగ్​కు ఇంకా పెళ్లి కాలేదు. అతడికి ఇద్దరు సోదరులు ఉండగా, అందులో ఒకరు చనిపోయాడు. ఈ క్రమంలోనే హకీమ్ సింగ్​కు ఉన్న భూమిని తన సోదరుడు, అతడి కుమారుడు లాక్కొని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో హకీమ్​ కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసం స్వీకరించాడు.

సొంతవాళ్లే హకీమ్​ను బయటకు గెంటేయడం వల్ల ఎవరూ దగ్గరకు తీయలేదు. ఈ క్రమంలో హకీమ్​కు, తాను చనిపోతే, మరణాంతర కర్మలను కుటుంబసభ్యులు సక్రమంగా పూర్తి చేస్తారో లేదో అన్న ఆలోచన వచ్చింది. ఇక వాళ్లు పూర్తి చేస్తారనే నమ్మకం కూడా హకీమ్​కు కుదరలేదు. దీంతో తన మరణాంతర కర్మలను తానే నిర్వహించాలని నిశ్చయించుకున్నాడు. ఆ కర్మలు చేయడానికి సంక్రాంతి పర్వదినాన్ని ఎంచుకున్నాడు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించాడు. అందులో 'జీవించి ఉండగానే చావు విందు- నేను జీవించి ఉండగానే నా చావు విందును ఏర్పాటు చేసుకుంటున్నాను. అలాగే నేను బతికుండగా ఎవరి అన్నం తిన్నానో - ఈ రోజు వారికి తినిపించి వారి రుణం తీర్చుకుంటున్నాను' అని తెలిపాడు.

హకీమ్​ ఈ విషయాన్ని గ్రామస్థులకు వివరించాడు. అతడి​ బాధను అర్థం చేసుకున్న గ్రామస్థులు, ఈ కార్యక్రమం చేయడానికి సహకరించారు. మకర సంక్రాంతి రోజు వచ్చిన అతిథులకు భోజనాలు ఏర్పాటు చేసి విందు ఇచ్చాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

చనిపోయాడని అంత్యక్రియలు- ఇంటికి తిరిగి వచ్చిన వ్యక్తి- అంతా షాక్

యూట్యూబ్​లో చూసి సొంత వైద్యం - కుమార్తె ప్రాణం మీదకు తెచ్చిన తండ్రి

ABOUT THE AUTHOR

...view details