తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్ర విభజన తర్వాత రిజర్వేషన్​పై సుప్రీం కీలక తీర్పు

రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత రిజర్వేషన్​ల అమలు ఎలా ఉండాలి అనే అంశంపై కీలక తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లో ఏదైనా ఒక దాంట్లోనే అభ్యర్థులకు రిజర్వేషన్ వర్తిస్తుందని తెలిపింది. కోటా లబ్ధిని ఒకే సమయంలో రెండు చోట్లా పొందలేరని స్పష్టంచేసింది.

By

Published : Aug 20, 2021, 4:42 PM IST

supreme court
రిజర్వేషన్

రిజర్వేషన్​లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రాల్లో ఏదైనా ఒకదానిలోనే అభ్యర్థులు రిజర్వేషన్ లబ్ధిని పొందగలరని తేల్చిచెప్పింది. ఒకేసారి రెండు రాష్ట్రాల్లో కోటా వర్తించదని స్పష్టం చేసింది. పంకజ్​ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​పై..​ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ అజయ్ రస్తోగీతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పుచెప్పింది.

ఏం జరిగిందంటే..

ఝార్ఖండ్​లో నివాసముండే పంకజ్​.. 2007లో ఆ రాష్ట్ర సివిల్ సర్వీస్ పరీక్ష రాశారు. అయితే ఆయన నియామకాన్ని నిరాకరించింది ఆ రాష్ట్ర హైకోర్టు. ఆయన శాశ్వత చిరునామా బిహార్ అని ఉండటమే అందుకు కారణం. దీనిని సుప్రీంలో సవాలు చేశారు షెడ్యూల్డ్​ తరగతికి చెందిన పంకజ్.

ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది సుప్రీం ధర్మాసనం. రిజర్వేషన్​కు అర్హులైనవారు 2000 నవంబరులో రాష్ట్ర విభజన అనంతరం.. బిహార్​, ఝార్ఖండ్​లో ఏదైనా ఒక్క రాష్ట్రంలోనే దాని లబ్ధి పొందగలరని తీర్పు చెప్పింది. ఒకేసారి కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల్లోనూ కోటాకు అవకాశం లేదని స్పష్టంచేసింది. అయితే కొత్తగా ఏర్పడిన బిహార్​కు చెందిన రిజర్వేషన్​ అర్హులు ఝార్ఖండ్​లో జనరల్​ కేటగిరీలో పోడీపడవచ్చని తెలిపింది. ఝార్ఖండ్​కు చెందినవారు బిహార్​లో జనరల్​ కోటా కిందకు వస్తారని తేల్చిచెప్పింది.

ఇదీ చూడండి:'రిజర్వేషన్​లలో 50శాతం పరిమితిని ఎత్తేయండి'

ABOUT THE AUTHOR

...view details