కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగాల్లో ఆదివారం నుంచి రెండు వారాల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. లాక్డౌన్ సమయంలో లిక్కర్ షాపులు సైతం మూసి ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.
లాక్డౌన్ ప్రకటనతో లిక్కర్ షాపుల ముందు బారులు - లాక్డౌన్
లాక్డౌన్ ప్రకటనతో లిక్కర్ షాపులకు పోటెత్తారు మద్యం ప్రియులు. కరోనా భయాలను పక్కన పెట్టి పెద్ద సంఖ్యలో దుకాణాల వద్దకు చేరుకున్నారు. ఈ దృశ్యాలు బంగాల్లోని కోల్కతా నగరంలో కనిపించాయి. ఏ లిక్కర్ షాప్ ముందు చూసినా పెద్ద పెద్ద క్యూలైన్లు దర్శనమిచ్చాయి.
మద్యం దుకాణాల ముందు బారులు
ఆదివారం ఉదయం 6 గంటల నుంచి లాక్డౌన్ అమలులోకి వస్తుందన్న నేపథ్యంలో లిక్కర్ దుకాణాలకు పోటెత్తారు మద్యం ప్రియులు. కోల్కతా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మద్యం షాపుల ముందు పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపించాయి. షాపు వద్ద భారీగా గుమిగూడిన దృశ్యాలు దర్శనమిచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో పురుషులతో పాటు మహిళలు పోటీపడ్డారు.
ఇదీ చూడండి:గూగుల్ మ్యూజియంలో సరికొత్త మాస్క్