ప్రజలకు ఎంతో చేసినట్టు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. నిజానికి అంబానీ-అదానీకి తప్ప ఎవరికీ ఏమీ చేయలేదని ఆరోపించారు సీపీఎం జాతీయ నేత బృందా కారాట్. వారికి రూ. 11లక్షల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని పేర్కొన్నారు.
తమిళనాడు కోవిల్పట్టిలో సీపీఎం అభ్యర్థి శ్రీనివాసన్ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు కారాట్. అనంతరం ఈటీవీ భారత్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని మరోమారు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని విమర్శించారు. ఆ పార్టీ హామీలనూ ప్రజలు విశ్వసించడం లేదని తెలిపారు. భాజపా చేతిలో అన్నాడీఎంకే కీలు బొమ్మగా మారిపోయిందని పేర్కొన్నారు కారాట్.
కోవిల్పట్టి నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా రాష్ట్రమంత్రి కదంపుర్ రాజు నిలిచారు. ఏఎంఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ బరిలో దిగారు. ఇక డీఎంకే పొత్తుతో సీపీఎం నుంచి శ్రీనివాసన్ ఎన్నికల్లో నిలిచారు.