Passport Police Clearance Certificate: పాస్‌పోర్టు దరఖాస్తు దారులకు ఊరట కలిగించే విషయాన్ని కేంద్రం తెలిపింది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ దరఖాస్తును సులభతరం చేస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 28 నుంచి ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పింది.
విదేశాలకు వెళ్లేవారికి గుడ్న్యూస్.. ఇక ఆ సర్టిఫికెట్ అప్లై ఆన్‌లైన్‌లోనే! - Passport Police Clearance Certificate latest news
విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త. పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవాలంటే ముందస్తు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి కనుక.. ఇక నుంచి ఆ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది. ఆ వివరాలు..
పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకోవాలంటే ముందస్తు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. ఇందుకోసం పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో స్లాట్‌ల ఆధారంగా వీటిని దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. స్థానిక పోలీస్స్టేషన్ వీటిని జారీ చేస్తుంది. ఇటువంటి దరఖాస్తులు భారీ స్థాయిలో రావడం వల్ల పీసీసీ జారీకి సమయం పడుతుండడం, తద్వారా అభ్యర్థులకు పాస్‌పోర్ట్ జారీ ఆలస్యం అవుతోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆన్‌లైన్ పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లోనూ పీసీసీ దరఖాస్తు చేసుకునేందుకు సదుపాయం కల్పిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.