బిహార్‌లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్చాక్ బ్లాక్‌లోని అగార్పుర్ గ్రామస్థులు మాత్రం ఇందుకు భిన్నం. వేడుకల్లో భాగంగా.. భగత్ అని పిలిచే కొందరు పూజారులు గ్రామంలోని ఓ నీటి కుంట నుంచి వందల పాములను బయటకు తీస్తారు. మంత్రాలు ఉచ్ఛరిస్తూ పాములను తీసి.. వాటితో విన్యాసాలు చేస్తారు. మెడకు చుట్టుకొని ఆడిస్తారు. ఇవేవీ సాధారణ సర్పాలా అంటే కాదు. చాలా వరకు విషపూరితమైనవే.
1981లో ఇక్కడ భగవతి స్థాన్ అనే మందిరం ఏర్పాటు చేశారని, అప్పటి నుంచి గ్రామానికి ఎలాంటి సమస్య రాలేదని స్థానికులు చెబుతున్నారు. పాములను పట్టుకునే సంప్రదాయాన్ని గ్రామ భగత్(పూజారి) ప్రారంభించారని తెలిపారు. ఈ వేడుకలు కాస్త విశేష ప్రాచుర్యంలోకి వచ్చి.. తమ ప్రాంతానికి పేరు తెచ్చిపెట్టాయని వివరించారు.
ఊరేగింపు