తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డీఎఫ్​ఐ బ్యాంకు ఏర్పాటుకు పార్లమెంట్​ ఆమోదం

మౌలిక వసతులు, అభివృద్ధి ఫైనాన్సింగ్ జాతీయ బ్యాంకుకు పార్లమెంటులో ఆమోద ముద్ర పడింది. ఈ బ్యాంకు ద్వారా దేశంలోని మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధుల పరికల్పన జరుగనుంది.

Par passes bill to set up National Bank for Financing Infrastructure and Development
మౌలిక వసతుల నిధుల బ్యాంకుకు పార్లమెంట్​ ఆమోదం

By

Published : Mar 25, 2021, 2:47 PM IST

మౌలిక వసతులు, అభివృద్ధి ఫైనాన్సింగ్ జాతీయ బ్యాంకు (ఎన్​ఏబీఎఫ్​ఐడీ)- డీఎఫ్‌ఐ (డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌)ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోద ముద్ర వేసింది పార్లమెంట్​. దేశంలోని మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఈ బ్యాంకు ద్వారా నిధులు అందనున్నాయి.

మూజువాణి ఓటు ద్వారా ఎన్​ఏబీఎఫ్​ఐడీ బిల్లు- 2021ని రాజ్యసభ గురువారం ఆమోదించింది. దీనికి మార్చి 23నే లోక్సభలో ఆమోదం లభించింది.

ఎన్​ఏబీఎఫ్​ఐడీ ద్వారా దేశంలోని మౌలిక వసతుల ప్రాజెక్టులకు నాన్ రీకోర్స్​ (లాభాల నుంచి మాత్రమే రుణగ్రహీత అప్పు చెల్లించాలి) నిధులు లభిస్తాయి. బాండ్లు, డెరివేటివ్స్​ మార్కెట్ల​ వృద్ధికి ఇది దోహదపడుతుంది. పైగా ఈ బ్యాంకు కేవలం పార్లమెంట్​కు మాత్రమే జవాబుదారీతనం వహిస్తుంది. మరిన్ని నిధుల లభ్యతకు ఎన్​ఏబీఎఫ్​ఐడీకి ఐదేళ్ల పాటు పన్ను మినహాయింపు కల్పించారు.

ఇదీ చూడండి:మౌలికాభివృద్ధికి మళ్లీ బ్యాంకు

ABOUT THE AUTHOR

...view details