తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో పాక్ జెండాల కలకలం.. అనుమానాస్పదంగా తిరుగుతున్న చైనీయులు అరెస్ట్ - ఉత్తరకాశీ లేటెస్ట్ అప్డేట్స్

ఉత్తరాఖండ్​లో చైనా-టిబెట్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అడవుల్లో పాక్ జెండా ఉన్న బెలూన్లు లభ్యమయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లోని భారత్-నేపాల్ సరిహద్దులో వీసా గడువు ముగిసిన ఇద్దరు చైనీయులను జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.

pakistani-flags-flying-with-balloons-found-in-uttarkashi
pakistani-flags-flying-with-balloons-found-in-uttarkashi

By

Published : Dec 31, 2022, 7:11 PM IST

ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని చైనా-టిబెట్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న చిన్యాలిసౌర్​కు చెందిన తుల్యడ గ్రామ అడవుల్లో శుక్రవారం దాదాపు 200 నుంచి 250 బెలూన్లు లభ్యమయ్యాయి. ఆ బెలూన్లపై పాకిస్థాన్ జెండాలు ఉండటం కలవరానికి గురి చేసింది. వీటితోపాటు లాహోర్ బార్ అసోసియేషన్ బ్యానర్ కూడా లభ్యమైంది. దీంతో స్థానికులలో భయాందోళనలు మొదలై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు ఐబీ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది.

బెలూన్లపై పాకిస్థాన్ జెండాలు కనిపించటం వల్ల నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. బ్యానర్ ఎక్కడి నుంచి ఎగిరి ఈ ప్రాంతానికి చేరుకుందనే కోణంలో ఇంటెలిజెన్స్‌ సంస్థలు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పొదల్లో ఉన్న బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు. 'తులియాడలో ఇలాంటి బ్యానర్లు ఉన్నట్లు సమాచారం అందింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. ఈ సమాచారాన్ని ఐబీకి అందించాం. దీనిపై స్థానిక పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. విచారణ తర్వతే లభించిన సమాచారాన్నిబట్టే ఏదైనా చెప్పగలం' అని ఎస్పీ అర్పణ్ యదువంశీ అన్నారు.

సరిహద్దులో పట్టుబడ్డ చైనీయులు

చైనీయులు అరెస్ట్
మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో మహరాజ్​గంజ్ జిల్లాకు ఆనుకుని ఉన్న భారత్-నేపాల్ సరిహద్దులో ఇద్దరు చైనీయులను ఎస్ఎస్​బీ అదుపులోకి తీసుకుంది. సరిహద్దులో ఎస్‌ఎస్‌బీ జవాన్లు సాధారణ తనిఖీలు చేస్తుండగా.. ఇద్దరు చైనీయులు భారత సరిహద్దు వైపు వస్తూ కనిపించారు. వారిని జవాన్లు విచారించగా.. సరైన సమాధానం రాలేదు. దీంతో జవాన్లు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. చైనీయులను అరెస్టు చేసిన సమాచారంపై నిఘా సంస్థలు కూడా వారిని ప్రశ్నించాయి. ఇద్దరికీ రిపబ్లిక్ ఆఫ్ చైనా పాస్​పోర్టులు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాస్ పోర్టులపై వారి పేర్లు జాంగ్ యింగ్‌జున్(50), సాంగ్ హుయ్(52) అని ఉన్నాయి. అయితే వారిద్దరికీ భారతదేశంలోకి ప్రవేశించడానికి వీసా గడువు ముగిసింది. ఇంతకు ముందు యువకులిద్దరూ చాలాసార్లు భారతదేశాన్ని సందర్శించారు.

పట్టుబడ్డ చైనీయుల పాస్​పోర్ట్​
పట్టుబడ్డ చైనీయుల పాస్​పోర్ట్​

ABOUT THE AUTHOR

...view details