తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాలిబన్ల సాయంతో భారత్​లో దాడులకు పాక్​ కుట్ర! - జైషే మహమ్మద్​

భారత్​లో రక్తపాతాన్ని సృష్టించేందుకు ఊవిళ్లూరే జైషే మహమ్మద్​ సంస్థ మరో కుట్రకు తెరతీసింది. అఫ్గాన్​ను వశం చేసుకున్న తాలిబన్లను జైషే మహమ్మద్(jaish e mohammed news)​ నేతలు కలిశారు. భారత్​ కేంద్రబిందువుగా సాగే తమ కార్యకలాపాలకు మద్దతివ్వాలని తాలిబన్లను(taliban latest news) వారు కోరినట్టు భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది.

jaish-e-mohammad
జేషే మహమ్మద్​

By

Published : Aug 28, 2021, 3:26 PM IST

అఫ్గానిస్థాన్​ సంక్షోభం(afghanistan news today) నేపథ్యంలో భారత్​కు ఆందోళనకర వార్త అందింది. పాకిస్థాన్​ ఆధారిత జైషే మహమ్మద్(jaish e mohammed news)​ నేతలు.. తాలిబన్లతో భేటీ అయినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడులకు పాల్పడే అవకాశమున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

అఫ్గాన్​ను తాలిబన్లు(taliban news) తమ వశం చేసుకున్న కొద్ది రోజులకే, ఆగస్టు మూడో వారంలో జైషే మహమ్మద్​ నేతలు తాలిబన్లతో కాందహార్​ వేదికగా చర్చలు జరిపినట్టు ఓ సీనియర్​ అధికారి వెల్లడించారు. భారత్​ కేంద్రబిందువుగా సాగే తమ కార్యకలాపాలకు మద్దతివ్వాలని జైషే మహమ్మద్​ తాలిబన్లను కోరినట్టు సమాచారం ఉందని ఆయన తెలిపారు. పాకిస్థాన్​ రాజకీయ పరిస్థితులపైనా ఈ సమావేశంలో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

నిఘావర్గాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాద నిరోధక బృందాలను హై అలర్ట్​లో ఉంచాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

"సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిఘా సంస్థలను ఆదేశించాము. ఆగస్టు 24న సరిహద్దులో ఇద్దరు ఉగ్రవాదుల కదలికలను పసిగట్టాము. శ్రీనగర్​లో వారు గ్రనేడ్​ దాడికి ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం ఉంది. అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశాము."

--- నిఘా అధికారి.

గతంలోనూ..

తాలిబన్లతో జైషే ముష్కరుల సంబంధాలు ప్రపంచానికి తెలియనివేం కాదు. 2020 ఏప్రిల్ 13-14 తేదీల్లో అఫ్గాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్​డీఎస్) కమాండో బృందం.. పాక్ సరిహద్దుకు సమీపంలోని మొమంద్ దరాలో ఉన్న తాలిబన్ క్యాంప్​పై దాడి చేసింది. ఈ ఎన్​కౌంటర్​లో 15మంది ఉగ్రవాదులు మరణిస్తే.. అందులో జైషేకు చెందిన ముష్కరులే 10మంది ఉన్నారు. వీరంతా పాక్, పీఓకేకు చెందినవారే. కశ్మీర్​లో పోరాడేందుకు తాలిబన్లు వీరికి శిక్షణ ఇస్తున్నారు.

లష్కరే తోయిబా, జైషే మహమ్మద్​ ఉగ్రసంస్థలు.. తాలిబన్లకు మానవ వనరులను అందిస్తున్నాయి. పంజాబ్ ప్రావిన్స్ నుంచి 'పోరాట యోధుల'ను అఫ్గాన్​కు పంపుతున్నాయి. ఇటీవల తాలిబన్లు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో జైషే, లష్కరే భాగమయ్యారని వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముష్కరులు కనిపించినట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. ఐరాస భద్రతా మండలి నివేదిక సైతం ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ రెండు సంస్థలు పాకిస్థాన్ నుంచే పనిచేయడం, భారత్​ను లక్ష్యంగా చేసుకొనే కార్యకలాపాలు సాగించడం గమనార్హం.

దేశంలో ముంబయి ఉగ్రదాడి, పుల్వామా ఉగ్ర ఘాతుకానికి పాల్పడింది జైషే మహ్మద్​ సంస్థే. దీని వెనక ఆ సంస్థ వ్యవస్థాపకుడు, కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్​ అజార్(jaish e mohammed leader) హస్తం ఉంది. ఈ క్రమంలో తమపై కుట్ర పన్నేందుకు పాక్​ మసూద్​ సహాయం తీసుకుంటోందని భారత్​ ఆరోపిస్తోంది. స్వయంగా పాకిస్థాన్ ఆర్మీ‌, ఐఎస్‌ఐ కలిసి అజార్‌ను అత్యంత భద్రమైన ప్రదేశంలో దాచారని పేర్కొంది. పాక్​లోని బహవల్‌పూర్‌లో ఓ బుల్లెట్‌ ప్రూఫ్‌ ఇంట్లో అజార్‌ సురక్షితంగా దాక్కొన్నట్లు తమకు సమాచారం ఉందని చెబుతోంది.

ఇదీ చూడండి:-తాలిబన్లతో జైషే, లష్కరే జట్టు- భారత్ పరిస్థితేంటి?

ABOUT THE AUTHOR

...view details