Painting worker wins Rs 12 crore: కేరళకు చెందిన ఓ పెయింటింగ్ కార్మికుడిని అదృష్టం వరించింది. కొట్టాయంలోని అయ్మాననం ప్రాంతానికి చెందిన సదానందన్.. క్రిస్మస్-న్యూఇయర్ సందర్భంగా నిర్వహించిన బంపర్ లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్నాడు.
లాటరీ టికెట్ కొన్న గంటలకే.. రూ.12 కోట్ల జాక్పాట్ - కేరళ లాటరీ టికెట్ వార్తలు
Lottery in Kerala: యాభై ఏళ్లుగా పెయింటింగ్ పని చేస్తూ జీవిస్తున్న ఓ కార్మికుడు రూ. 12 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. విజేతలను ప్రకటించడానికి కొన్ని గంటల ముందే లాటరీ టికెట్ కొనడం విశేషం.
రూ.12 కోట్ల జాక్పాట్
లక్కీ డ్రా విజేతలను ప్రకటించడానికి కొద్ది గంటల ముందే లాటరీని కొన్నాడు సదానందన్. గత యాభై ఏళ్లుగా తాను పెయింటింగ్ వృత్తిలోనే ఉన్నట్లు తెలిపాడు. లాటరీలో వచ్చిన డబ్బును తన పిల్లల భవిష్యత్ కోసం ఉపయోగించుకుంటానని చెప్పాడు.
ఇదీ చదవండి:ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేస్తే.. రూ.11 లక్షలు హాంఫట్!
Last Updated : Jan 19, 2022, 8:06 AM IST