Nanda Prusty News: ఇటీవల పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఉపాధ్యాయుడు నందా ప్రస్తీ (104) మంగళవారం కన్నుమూశారు. ఒడిశాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సామాజిక సేవ, విద్యారంగంలో ఆయన అందించిన నిరుపమాన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ పురస్కారంతో గౌరవించింది. నందా ప్రస్తీ మాస్టర్ మరణవార్త తెలుసుకున్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
nanda prusty odisha: పద్మశ్రీ గ్రహీత నందా ప్రస్తీ ఇకలేరు
Nanda Prusty News: ఇటీవల పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఉపాధ్యాయుడు నందా ప్రస్తీ (104) మంగళవారం కన్నుమూశారు. ఒడిశాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"ఒడిశా నుంచి వచ్చి విద్యారంగంలో సేవలందించిన 'నందా సర్' తరతరాలకు గుర్తుండిపోతారు. కొన్ని వారాల క్రితం పద్మ అవార్డు వేడుకల్లో ఆయన దేశం దృష్టిని ఆకర్షించి అందరి అభిమానాన్నీ పొందారు. ఆయన మరణవార్త నన్ను బాధించింది. ఓం శాంతి" అని ట్వీట్ చేశారు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన నందకిశోర్ మాస్టర్ కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఏడో తరగతిలోనే పాఠశాల విద్యకు దూరమయ్యారు. తనకు జరిగినట్టు ఇతరలకు జరగకూడదనే ఉద్దేశంతో 82ఏళ్ల పాటు గ్రామీణ బాలికలకు, ప్రజలకు విద్యాబోధన చేశారు. పైసా తీసుకోకుండా ఉచితంగా పాఠాలు చెప్పిన మాస్టర్‌గా పేరొందారు.
ఇదీ చదవండి:కేంద్రం ప్రతిపాదనపై రైతుల అభ్యంతరం- నిరసనలపై బుధవారం నిర్ణయం!