Padma Awards Refused: గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలను వద్దనుకుంటున్న వారి జాబితా పెరుగుతోంది. ఇప్పటికే పద్మభూషణ్ పురస్కారాన్ని సీపీఎం సీనియర్ నేత, బంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య తిరస్కరించారు.
Singing legend Sandhya Mukherjee: అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ కూడా పద్మశ్రీ స్వీకరించేందుకు నిరాకరించారు. ఇప్పుడు.. బంగాల్‌కు చెందిన ప్రముఖ వాద్యకారుడు పండిట్ అనింద్య ఛటర్జీ తనకు ప్రకటించిన పద్మశ్రీ వద్దంటున్నారు.
పద్మశ్రీ వచ్చినట్లు మంగళవారమే దిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పిన అనింద్య.. తన కెరీర్ ఈ దశలో ఉన్నప్పుడు పద్మశ్రీ అందుకోవడానికి సిద్ధంగా లేనని వెల్లడించారు.
''నాకు పద్మశ్రీ వచ్చిందని మంగళవారమే దిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. కానీ నేను సున్నితంగా తిరస్కరించా. నేను వారికి ధన్యవాదాలు చెప్పాను కానీ.. నా కెరీర్ ఈ దశలో ఉన్నప్పుడు పద్మశ్రీ అందుకునేందుకు నేను సిద్ధంగా లేను. ఆ ఫేజ్ ఎప్పుడో దాటేశా.''
- అనింద్య ఛటర్జీ, తబలా వాద్యకారుడు
- Tabla Maestro Anindya Chatterjee: 10 సంవత్సరాల క్రితమే ఈ పురస్కారం వచ్చి ఉంటే.. ఆనందంగా స్వీకరించేవాడినని అనింద్య అన్నారు. 'ఏదేమైనా నేను అవార్డు తీసుకోను.. క్షమించండి' అని చెప్పారు.
- పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ వంటి మహామహులతో కలిసి పనిచేశారు ఛటర్జీ. 2002లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు.