ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (UP Election 2022) ముస్లిం ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గుచూపుతారన్నది అసక్తికరంగా మారింది. ఇంతవరకు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు వారు ఓటేస్తుండగా ఎంఐఎం (AIMIM UP Election) రంగ ప్రవేశంతో పరిస్థితులు మారాయి. తక్కువ సంఖ్యలో ఉన్న జాతవ్, యాదవ్, రాజ్‌భర్, నిషాద్ కులాల వారికి ప్రత్యేకంగా పార్టీలు, నాయకులు అంటూ ఉండగా 19 శాతం మేర ఉన్న ముస్లింలకు ఏకీకృత నాయకత్వం లేకపోవడాన్ని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi UP Election) ప్రస్తావిస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు ముస్లింలను ఓటు బ్యాంకులుగా మార్చుకొని బానిసలుగా చూస్తున్నాయని అంటున్నారు. దీనికి విముక్తి కలిగించి సమర్థ నాయకత్వం ఇవ్వడమే తమ లక్ష్యమని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 408 స్థానాలు ఉండగా అందులో 82 చోట్ల ముస్లింల ప్రభావం అధికంగా ఉంది. అందువల్ల 100 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని ఎంఐఎం భావిస్తోంది.
'ఓట్ ఖత్వా'
బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో ముస్లింల మెజార్టీ (Muslim Vote in UP) అధికంగా ఉండటం వల్ల అక్కడ అభ్యర్థులను నిలబెట్టి (AIMIM UP Election) అయిదు సీట్లను పొందింది. అదే సూత్రాన్ని ఇక్కడా అమలు చేయాలని అనుకుంటోంది. దీనివల్ల భాజపాకు ఎలాంటి నష్టం లేకపోయినా, మిగిలిన మూడు పార్టీలు మాత్రం ఇబ్బంది పడుతున్నాయి. తమకు రావాల్సిన ఓట్లకు గండి పడుతుందని భయపడుతున్నాయి. అందుకే ఒవైసీని (Owaisi UP News) 'ఓట్ ఖత్వా' (ఓట్లను చీల్చే వ్యక్తి) అని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అబు అజ్మీ విమర్శించారు. ముస్లిం ఓట్లు తమకు రాకుండా చేయడానికే భాజపా తరపున ఆయన పోటీ చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం ఓట్లు తమకు రాకుండా చేయడానికే భాజపా తరఫున ఆయన పోటీ చేస్తున్నారని విమర్శించారు.