తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాక్సినేషన్ 3.0: తొలి రోజు 84వేల మందికి టీకా - కరోనా టీకా

మూడో దశ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు 84,599 మంది(18-44 వయస్కుల వారు) వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 15.66కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

VACCINE
వ్యాక్సినేషన్3.0

By

Published : May 2, 2021, 5:34 AM IST

కరోనా టీకా మూడో దశ వ్యాక్సినేషన్​లో భాగంగా దేశవ్యాప్తంగా 18-44ఏళ్ల వయసున్న వారిలో 84,599మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శనివారం(రాత్రి 8గంటల వరకు) మరో 16,48,192 మందికి టీకా ఇచ్చినట్లు పేర్కొంది.

అందులో 9,89,700 మంది మొదటి డోసు తీసుకోగా.. 6.58లక్షల మంది రెండో డోసు టీకా అందుకున్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15.66కోట్ల డోసుల పంపిణీ పూర్తయినట్లు వెల్లడించింది.

మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ మే1న మొదలైంది. ఇందులో భాగంగా 18-44ఏళ్ల మధ్య వయసున్న వారికి టీకా అందిస్తున్నారు.

ఇదీ చదవండి:ఆక్సిజన్ కొరతతో నలుగురు కరోనా రోగులు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details