రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండు కోట్లకు పైగా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. ఇందుకు అదనంగా సుమారు మూడు కోట్ల డోసులను రానున్న మూడు రోజుల్లో అందించనున్నామని తెలిపింది. ఇప్పటివరకు 20 కోట్లకు పైగా (20,76,10,230) వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించామని పేర్కొంది. వీటిలో 18 కోట్లకుపైగా (18,71,13,705) డోసులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వినియోగించుకున్నాయని తెలిపింది.
'రాష్ట్రాల వద్ద 2 కోట్ల టీకాలు- 3 రోజుల్లో మరో 3 కోట్లు!'
రాష్ట్రాల వద్ద రెండు కోట్లకుపైగా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 20 కోట్లకుపైగా డోసులను ఉచితంగా అందించామని పేర్కొంది.
టీకాలపై కేంద్రం
కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ డ్రైవ్లో కేంద్రం.. రాష్ట్రాలకు ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తూ మద్దతుగా నిలుస్తోందని ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రాలకు డోసుల ఉచిత పంపిణీని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. వైరస్ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో వ్యాక్సినేషన్ కీలక భాగమని పేర్కొంది.
ఇదీ చదవండి :'నారదా స్టింగ్' కేసులో టీఎంసీ మంత్రుల అరెస్టు