ఇప్పటివరకు 1.19 కోట్ల టీకా డోసులను ఆరోగ్య కార్యకర్తలు, కరోనా యోధులకు అందించామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 1,19,07,392 డోసులు 2,53,434 సెషన్లలో పంపిణీ చేశామని పేర్కొంది. ఆరోగ్య కార్యకర్తల్లో 64.71 లక్షల మంది తొలి డోసు అందుకోగా, 13.21 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు. కరోనా యోధుల్లో 41.14 లక్షల మంది తొలి డోసు అందుకున్నారు. టీకా పంపిణీ జనవరి 16న ఆరోగ్య కార్యకర్తలకు ప్రారంభం కాగా, ఈనెల 2న కరోనా యోధులకు అందుబాటులోకి వచ్చింది.
ప్రైవేటు ఆస్పత్రులకు..