AIADMK: అన్నాడీఎంకే అగ్రనేత పన్నీర్‌సెల్వం సోదరుడు రాజా.. పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. పార్టీ సంబంధిత వ్యవహారాలపై వీకే శశికళతో చర్చలు జరిపినందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన సహా నియమాలకు విరుద్ధంగా పనిచేయడం వంటి కారణాలతో రాజాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు ఏఐఏడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, కోఆర్డినేటర్ కే పళనిస్వామి సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంలో మరో ముగ్గరిని సస్పెండ్ చేశారు.