తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Opposition No Confidence Motion 2023 : అవిశ్వాస తీర్మానంతో ప్రజల్ని మభ్యపెట్టే యత్నం: అమిత్ షా

OPPOSITION NO CONFIDENCE MOTION 2023
OPPOSITION NO CONFIDENCE MOTION 2023

By

Published : Aug 9, 2023, 11:03 AM IST

Updated : Aug 9, 2023, 5:29 PM IST

17:26 August 09

విపక్షాలపై అమిత్ షా ఫైర్
అవిశ్వాస తీర్మానంపై లోక్​సభలో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. గాంధీ క్విట్ ఇండియా నినాదం మాదిరిగానే.. అవినీతి, కుటుంబ పాలన రాజకీయాలకు వ్యతిరేకంగా మోదీ నినాదం ఇచ్చారని అన్నారు.

  • ఆగస్ట్‌ 9నే గతంలో గాంధీ క్విట్‌ ఇండియా పిలుపు ఇచ్చారు
  • అవినీతి, కుటుంబపాలన రాజకీయాలకు మోదీ భరతవాక్యం పలికారు
  • గతంలో పీవీ ప్రభుత్వం ఎంపీల కొనుగోలు ద్వారా అవిశ్వాసం నెగ్గింది
  • ఎంపీల కొనుగోలు కేసులో చాలామంది జైలుకు కూడా వెళ్లారు
  • నిజాయితీతో అవిశ్వాసాన్ని ఎదుర్కొని వాజ్‌పేయీ ఒక్క ఓటు తేడాతో ప్రధాని పదవి నుంచి దిగిపోయారు
  • వాజ్‌పేయీ తలచుకుంటే అప్పట్లో అవిశ్వాసాన్ని సులభంగా నెగ్గేవారు
  • ఒడిశా సీఎంగా ప్రమాణం చేసిన ఒక ఎంపీ ఓటుతో వాజ్‌పేయీ పదవి కోల్పోయారు
  • నిజాయితీ, నిబద్ధతతో నిలిచినందుకే వాజ్‌పేయీ మళ్లీ ప్రధాని అయ్యారు
  • ఇది ట్రైలర్ మాత్రమే.. మొత్తం వినేందుకు విపక్ష ఎంపీలకు ధైర్యం ఉండాలి
  • స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో అవిశ్వాస, విశ్వాస తీర్మానాలు చర్చకు వచ్చాయి
  • కానీ.. విపక్షాలు తమపై విశ్వాసం కోసం అవిశ్వాసం పెట్టడం ఇదే తొలిసారి
  • ఈ ప్రభుత్వంపై ప్రజలకు, ఎంపీలకు పూర్తి విశ్వాసం ఉంది
  • ఈ అవిశ్వాస తీర్మానం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించట్లేదు
  • స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యధిక ప్రజాదరణ కలిగిన ప్రధాని మోదీయే
  • ప్రధాని మోదీ జనాదరణ గురించి అనేక అంతర్జాతీయ సంస్థల సర్వేలు ఇప్పటికే చెప్పాయి

17:11 August 09

లోక్​సభలో అమిత్ షా ప్రసంగం

విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సాయంత్రం లోక్​సభలో మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని కీలకాంశాలు..

  • విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాయి
  • సర్కారు సరిగా పనిచేయనప్పుడు విపక్షాలు అవిశ్వాసం పెడతాయి
  • ప్రజాందోళనలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రవేశపెడతాయి
  • ప్రధాని, మంత్రుల తరఫున ఎవరికీ అవిశ్వాసం లేదు
  • ప్రజల్లోనూ అవిశ్వాసం లేదు.. సభలోనూ అవిశ్వాసం లేదు
  • ఇలాంటి పరిస్థితుల్లో విపక్ష సభ్యులు అవిశ్వాసం తీసుకువచ్చాయి
  • ప్రజలను మభ్యపెట్టడానికి ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నిస్తున్నారు
  • ప్రజల ఆకాంక్షల మేరకు అవిశ్వాసం తీసుకురాలేదు
  • ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది

15:56 August 09

  • లోక్‌సభలో రాహుల్‌గాంధీ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారని భాజపా సభ్యుల ఆరోపణ
  • రాహుల్‌గాంధీపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన భాజపా మహిళా ఎంపీలు
  • స్మృతి ఇరానీ, ఇతర ఎంపీల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు
  • రాహుల్‌గాంధీ లోక్‌సభ ప్రతిష్టను మంటగలిపారని ఫిర్యాదు
  • రాహుల్‌గాంధీపై చర్యలు తీసుకోవాలని భాజపా మహిళా ఎంపీల ఫిర్యాదు
  • లోక్‌సభ నుంచి బయటకెళ్తూ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారన్న భాజపా ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌
  • రాహుల్‌గాంధీకి ఏమైందని ప్రశ్నించిన భాజపా ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌
  • లోక్‌సభలో మహిళలంతా కూర్చొని ఉన్నారు: భాజపా ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌
  • రాహుల్‌గాంధీ సంస్కారహీనంగా ప్రవర్తించడం బాధాకరం: రవిశంకర్‌ ప్రసాద్‌

12:55 August 09

లోక్​సభలో స్మృతి ఇరానీ ప్రసంగం

  • రాహుల్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: స్మృతి ఇరానీ
  • భరత మాతను హత్య చేశారని అంటే కాంగ్రెస్‌ సభ్యులు బల్లలు చరుస్తున్నారు: స్మృతి ఇరానీ
  • మణిపుర్‌ మన దేశంలో భాగం.. ఎవరూ విడదీయలేరు: స్మృతి ఇరానీ
  • దేశంలో అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్‌ పార్టీయే: స్మృతి ఇరానీ
  • మహిళలపై అత్యాచారాలు యూపీఏ హయాంలో చాలా జరిగాయి: స్మృతి ఇరానీ
  • రాజస్థాన్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ చేసి.. ముక్కలుగా నరికేశారు: స్మృతి ఇరానీ
  • ఆర్టికల్‌ 370 రద్దు వల్లనే రాహుల్‌ పాదయాత్ర చేయగలిగారు: స్మృతి ఇరానీ
  • ఆర్టికల్‌ 370 మళ్లీ తెస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు: స్మృతి ఇరానీ
  • కశ్మీర్‌ పండితులకు జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించవా?: స్మృతి ఇరానీ
  • కశ్మీర్‌ మహిళలకు జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించవా?: స్మృతి ఇరానీ

12:46 August 09

  • మణిపుర్‌లో భారత మాతను హత్య చేశారు..
  • మణిపుర్‌ ప్రజలను చంపడం ద్వారా దేశాన్ని చంపేశారు..
  • మీరు దేశభక్తులు కాదు... మీరు దేశ ద్రోహులు..
  • మీరు దేశాన్ని రక్షించే వారు కాదు.. దేశ హంతకులు..
  • మణిపుర్‌లో మీరు తల్లులను హత్య చేశారు..
  • మన సైన్యం తలచుకుంటే మణిపుర్‌లో ఒక్కరోజులోనే శాంతి సాధ్యం..
  • మోదీ మణిపుర్‌ మాట వినేందుకు ఇష్టపడట్లేదు
  • రావణుడు కేవలం మేఘనాథ్‌, కుంభకర్ణుడి మాటలే వినేవాడు..
  • మోదీ కూడా అమిత్‌షా, అదానీ మాటలే వింటున్నారు..
  • మణిపుర్‌కు మోదీ హనుమాన్‌కు పంపలేదు..

12:41 August 09

రాహుల్‌ -గందరగోళం

  • రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై గందరగోళం
  • రాహుల్‌ గాంధీ ప్రసంగంపై భాజపా సభ్యుల అభ్యంతరాలు
  • రాహుల్‌ ప్రసంగాన్ని అడ్డుకుంటున్న భాజపా సభ్యులు
  • కొన్నిరోజుల క్రితం నేను మణిపుర్‌ వెళ్లాను..
  • ప్రధాని మోదీ ఇప్పటి వరకు మణిపుర్‌ వెళ్లలేదు..
  • ప్రధాని మోదీ దృష్టిలో మణిపుర్‌ దేశంలో భాగం కాదు..
  • మణిపుర్‌ పునరావాస శిబిరాల్లోని మహిళలు, పిల్లలతో నేను మాట్లాడాను..
  • మణిపుర్‌ బాధితులకు మద్దతుగా నేను రాత్రంతా వారితో గడిపాను
  • ప్రధాని మోదీ మణిపుర్‌ను రెండు వర్గాలుగా విడగొట్టారు
  • నేను అబద్దాలు చెప్పడం లేదు.. మీరే అబద్దాలు చెబుతారు..
  • మీకు రాజనీతి లేదు.. మీరు హిందూస్థాన్‌ను హత్య చేశారు..

12:21 August 09

రాహుల్‌గాంధీ ప్రసంగానికి అడ్డుపడుతున్న భాజపా ఎంపీలు

  • ముందుగా నా సభ్యత్వం పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు
  • నా ప్రసంగం గురించి భాజపా ఎంపీలు భయపడాల్సిన అవసరంలేదు..
  • నా ప్రసంగంలో ఒకటి, రెండు తూటాలు పేలతాయి.. భయపడొద్దు
  • ఇటీవల నేను దేశం ఒక మూల నుంచి మరో మూలకు పాదయాత్ర చేశా
  • పాదయాత్ర ఎందుకు చేస్తున్నావని చాలామంది నన్ను అడిగారు
  • కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేయడం వెనుక నీ లక్ష్యం ఏంటని అడిగారు
  • భారత దేశాన్ని అర్థం చేసుకునేందుకు, ప్రజలకు కలిసేందుకు పాదయాత్ర చేయాలనుకున్నా
  • నా పాదయాత్ర పూర్తి కాలేదు.. ఇక ముందు కూడా కొనసాగుతుంది
  • పాదయాత్ర ప్రారంభించిన మొదట్లో నాకు అహంకారం ఉండేది
  • పాదయాత్ర కొనసాగుతున్న కొద్దీ నాలో అహంకారం క్రమంగా మాయమైంది
  • పాదయాత్రలో రోజూ విభిన్న రంగాల వారిని కలిశాను
  • సామాన్యులను, ధనవంతులను, వ్యాపారులను.. ఇలా అన్ని వర్గాలను కలిశాను
  • అందరితో కలుస్తూ.. అందరి మాటలు వింటూ పాదయాత్ర కొనసాగించా ..
  • నేను నమ్మిన సత్యం కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం

12:16 August 09

అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ

  • భాజపా వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు
  • అదానీ అంశంపై నేను ఈరోజు మాట్లాడను
  • ఈరోజు హృదయంతో మాట్లాడతాను
  • నా ప్రసంగం గురించి భాజపా ఎంపీలు భయపడాల్సిన అవసరంలేదు..

10:44 August 09

Opposition No Confidence Motion 2023 :

Opposition No Confidence Motion 2023 : బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్​సభలో విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరగనుంది. బుధవారం జరిగే ఈ చర్చలో కాంగ్రెస్​లోని కీలక నేత రాహుల్​ గాంధీ ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు పార్టీ తరఫున రేవంత్‌ రెడ్డి, హిబి ఇడన్‌ పేర్లను పంపినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఇందుకోసం ఇండియా కూటమి రాజ్యసభలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో సమావేశమయ్యారు. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత తొలిసారిగా పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు రాహుల్‌. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని ఆయన ఏవిధంగా ఇరుకున పెడతారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. వాస్తవానికి రాహుల్‌ మంగళవారమే ప్రసంగిస్తారని ప్రచారం జరిగినా.. అలా జరగలేదు. మరోవైపు బీజేపీ తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్​ షా మాట్లాడనున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని బలంగా తిప్పికొట్టాలని ప్రధాని మోదీ ఇప్పటికే సూచించారు.

Last Updated : Aug 9, 2023, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details