నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో (Parliament Winter Session) కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. సాగు చట్టాలు, ద్రవ్యోల్బణం, చైనా చొరబాట్లు, పెగసస్ స్పైవేర్‌పై కేంద్రాన్ని నిలదీయాలని (winter session of parliament) వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ధర పెరుగుదల అంశాన్ని తప్పక లేవనెత్తుతుందని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. గత ఏడు నెలలుగా ద్రవ్యోల్బణం రేటు రెండంకెల పైనే ఉందని గుర్తు చేశారు. నిత్యావసరాల ధరలను తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరోనా సమయంలో సామాన్య ప్రజల కష్టాలను మరింత రెట్టింపు చేశారని ధ్వజమెత్తారు.
ప్రజలపై దాడి: రాహుల్ గాంధీ