తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ONGC Apprentice Jobs : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో.. ఓఎన్​జీసీలో అప్రెంటీస్​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

ONGC Apprentice Jobs In Telugu : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్​జీసీ 2500 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, తదితర పూర్తి వివరాలు మీ కోసం.

ONGC Apprentice Recruitment 2023 for 2500 posts
ONGC Apprentice Jobs

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 10:45 AM IST

ONGC Apprentice Jobs : గ్రాడ్యుయేషన్​, డిప్లామా, ఐటీఐ చేసి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ.. ఆయిల్​ అండ్​ నేచురల్ గ్యాస్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ (ఓఎన్​జీసీ) 2500 అప్రెంటీస్​ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్​ 20వ తేదీలోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు
ONGC Apprentice Post Details :

  • గ్రాడ్యుయేట్​ అప్రెంటీస్​
  • డిప్లొమా అప్రెంటీస్​
  • ట్రేడ్​ అప్రెంటీస్​

సెక్టార్ల వారీగా ఖాళీల వివరాలు

  • నార్తర్న్​ సెక్టార్​ - 159
  • ముంబయి సెక్టార్​ - 436
  • వెస్ట్రన్​ సెక్టార్ - 732
  • ఈస్ట్రన్ సెక్టార్ - 593
  • సదరన్ సెక్టార్ - 378
  • సెంట్రల్​ సెక్టార్​ - 202
  • మొత్తం ఖాళీలు - 2500

ట్రేడ్​/ విభాగాలు
డేటా ఎంట్రీ ఆపరేటర్​, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్​, సెక్రటేరియల్ అసిస్టెంట్​, ఎలక్ట్రీషియన్​, సివిల్ ఎగ్జిక్యూటివ్​, పెట్రోలియం ఎగ్జిక్యూటివ్​, ఆఫీస్​ అసిస్టెంట్​, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్​, ఫిట్టర్​, డీజిల్​ మెకానిక్​, ఇన్​స్ట్రుమెంట్​ మెకానిక్​, స్టోర్​ కీపర్​, మెషినిస్ట్​, సర్వేయర్​

విద్యార్హతలు
ONGC Apprentice Qualification :

  • గ్రాడ్యుయేట్​ అప్రెంటీస్​ : బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీటెక్​, బీఈ
  • డిప్లొమా అప్రెంటీస్​ : డిప్లొమా
  • ట్రేడ్​ అప్రెంటీస్​ : 10వ తరగతి, 10+2వ తరగతి, ఐటీఐ

వయోపరిమితి
ONGC Apprentice Age Limit : 2023 సెప్టెంబర్​ 20 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

స్టైపెండ్​ :
ONGC Apprentice Stipend Amount :

  • గ్రాడ్యుయేట్​ అప్రెంటీస్ - రూ.9000
  • డిప్లొమా అప్రెంటీస్ - రూ.8000
  • ట్రేడ్ అప్రెంటీస్​ - 7000

ఎంపిక ప్రక్రియ
ONGC Apprentice Selection Process : అభ్యర్థులకు ముందుగా అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను.. ధ్రువ పత్రాల పరిశీలన చేసి ఆయా అప్రెంటీస్​ పోస్టులకు ఎంపిక చేస్తారు.

వర్క్​ సెంటర్
కాకినాడ, రాజమహేంద్రవరం, దేహ్రాదూన్, మెహసానా, జోర్హాట్​, నజీరా అండ్ శివసాగర్​, సిల్చార్​, చెన్నై, కరైకాల్​, అగర్తల, కోల్​కతా, దిల్లీ, జోద్​పుర్​, గోవా, హజీరా, ముంబయి, ఉరాన్​, అహ్మదాబాద్​, అంకలేశ్వర్​, బరోడా, బొకారో, కాంబే

దరఖాస్తు చేయడం ఎలా?
ONGC Apprentice Apply Online : అభ్యర్థులు ఓఎన్​జీసీ అధికారిక వెబ్​సైట్​ www.ongcindia.com లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
ONGC Apprentice Important Dates :

  • ఆన్​లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్​ 1
  • ఆన్​లైన్​ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్​ 20
  • రిజల్ట్స్​​/ సెలక్షన్​ తేదీ : 2023 అక్టోబర్​ 5

ABOUT THE AUTHOR

...view details